Bhola Shankar Collections భోళా శంకర్‌కు భారీ కలెక్షన్లు..ఆ ముగ్గురితో గట్టి దెబ్బ.. వరల్డ్ వైడ్ ఎన్ని కోట్లంటే
మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, మహానటి కీర్తి సురేష్ కాంబినేషన్‌లో మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన చిత్రం భోళా శంకర్. పంద్రాగస్టు కానుకగా ఆగస్టు 11వ తేదీన రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరిగింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత తొలి రోజు ఏ రేంజ్ కలెక్షన్లు అందుకొన్నది? ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఏ మేరకు బిజినెస్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే..
తమిళంలో సూపర్‌స్టార్ అజిత్ నటించిన వేదాళం సినిమా ఆధారంగా తెరకెక్కిన భోళా శంకర్ చిత్రంలో భారీ తారాగణం కనిపించింది. అంతేకాకుండా పేరున్న సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ క్వాలిటీ పెరిగిపోవడంతో ఈ సినిమాకు ఖర్చు కూడా భారీగానే జరిగింది. ఈ సినిమాను సుమారు 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

భోళా శంకర్ సినిమాకు మంచి క్రేజ్ రావడంతో రికార్డుస్థాయి స్క్రీన్లలో రిలీజ్‌కు ప్లాన్ చేశారు. ఈ సినిమా స్క్రీన్ల విషయానికి వస్తే.. నైజాంలో 280 స్క్రీన్లు, సీడెడ్‌లో 190 స్క్రీన్లు, ఆంధ్రాలో 410 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఏపీ, నైజాం ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 900 థియేటర్లలో రిలీజ్ చేశారు.
ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి 150 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 500 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. దాంతో ఈ ప్రపంచవ్యాప్తంగా సినిమాను మొత్తంగా 1500 స్క్రీన్లలో విడుదల చేశారు. ఇటీవల కాలంలో చిరంజీవి నటించిన సినిమాను ఈ రేంజ్‌లో రిలీజ్ చేయడం గమనార్హం.

భోళా శంకర్ సినిమాకు తొలి రోజు భారీగా ఆక్యుపెన్సీ కనిపించింది. హైదరాబాద్‌లో 70 శాతం, బెంగళూరులో 50 శాతం, చెన్నైలో 35 శాతం, విజయవాడలో 80 శాతం, వరంగల్‌లో 75 శాతం, గుంటూరులో 98 శాతం, వైజాగ్‌లో 90 శాతం, నిజమాబాద్‌లో 45 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది.

ఇక భోళా శంకర్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఘనంగానే బాక్సాఫీస్ ఓపెనింగ్స్ కనిపించాయి. తొలి రోజు ఇండియా వైడ్ 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లను కలుపుకొంటే ఈ సినిమా తొలి రోజు 30 నుంచి 35 కోట్ల రూపాయల మధ్య వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

భోళా శంకర్ తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇటీవల రిలీజైన చిరంజీవి సినిమాల సాధించిన ఓపెన్సింగ్స్ కంటే తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ కనిపిస్తున్నది. రజనీకాంత్ నటించిన జైలర్, అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ 2, సన్నిడియోల్ నటించిన గదర్ 2 సినిమాలు గట్టి పోటీ ఇస్తున్నాయి.


Click it and Unblock the Notifications











