Bhola Shankar Day 1 Collections: ఫస్ట్ డే షాకింగ్ వసూళ్లు.. అన్ని కోట్లు వచ్చినా.. ఆ డిజాస్టర్ కంటే!

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ టాప్ హీరోగా దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఏజ్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలను చేస్తోన్న ఆయన.. సినీ ప్రియులను, అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తున్నారు.

ఈ జోష్‌లోనే ఇప్పుడు 'భోళా శంకర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి అన్ని ఏరియాల్లోనూ అనుకున్న రీతిలో స్పందన రాలేదనే చెప్పాలి. దీంతో ఈ ప్రభావం మొదటి రోజు కలెక్షన్లపై చూపించింది. ఈ నేపథ్యంలో అసలు 'భోళా శంకర్'కు ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయో చూద్దాం పదండి!

Bhola Shankar Movie Day 1 Official Box Office Collections

భోళా శంకర్‌గా చిరంజీవి రాక: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రమే 'భోళా శంకర్'. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించింది. అలాగే, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, హైపర్ ఆదిలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. మహతి స్వర సాగర్ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు.

Bhola Shankar Movie Day 1 Official Box Office Collections

భోళా శంకర్ బిజినెస్ డీటేల్స్: చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 12 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.60 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.60 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.60 కోట్లు బిజినెస్ చేసింది.

Bhola Shankar Movie Day 1 Official Box Office Collections

అలాంటి టాక్ వచ్చింది కానీ: క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'భోళా శంకర్' మూవీకి అమెరికాలో వేసిన ప్రీమియర్ షోల నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే సీన్ కనిపించింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన ఆశించిన రీతిలో దక్కలేదు. అయినప్పటకీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్లు వస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు.

Bhola Shankar Movie Day 1 Official Box Office Collections

తొలి తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'భోళా శంకర్'కి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.51 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.02 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.84 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.32 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.85 కోట్లు, గుంటూరులో రూ. 2.08 కోట్లు, కృష్ణాలో రూ. 1.03 కోట్లు, నెల్లూరులో రూ. 73 లక్షలతో కలిపి.. రూ. 15.38 కోట్లు షేర్, రూ. 22.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

Bhola Shankar Movie Day 1 Official Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రా, తెలంగాణలో రూ. 15.38 కోట్లు రాబట్టిన 'భోళా శంకర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.95 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 18.38 కోట్లు షేర్‌, రూ. 28.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

Bhola Shankar Movie Day 1 Official Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'భోళా శంకర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 80.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 18.38 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 62.12 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Bhola Shankar Movie Day 1 Official Box Office Collections

ఆ సినిమాల కంటే తక్కువగా: మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలకు తెలుగులో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తుంటాయన్న విషయం తెలిసిందే. కానీ, 'భోళా శంకర్' మూవీకి మాత్రం ఆశించిన రీతిలో వసూళ్లు రాలేదు. ఫలితంగా ఆయన గత చిత్రాలు 'సైరా: నరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య', 'ఆచార్య' మూవీల కంటే తక్కువే షేర్ వచ్చింది. కానీ, 'గాడ్ ఫాదర్' కంటే ఎక్కువ షేర్ లభించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X