Bhola Shankar Box office Collections భారీగా పడిపోయిన భోళా శంకర్ కలెక్షన్లు.. ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి అంట
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రం ఆగస్టు 11వ తేదీన రిలీజై మిక్స్‌డ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. ఈ చిత్రం మాస్ ఆడియెన్స్‌కు చేరువ కాగా, రెగ్యులర్ ఆడియెన్స్ దూరంగా ఉంది. సిస్టర్ సెంటిమెంట్ మెప్పించినప్పటికీ.. రొటీన్, రెగ్యులర్ కథ, కథనాల కారణంగా సినీ విమర్శకులు పెదవి విరిచారు. అయితే డివైడ్ టాక్‌తోను తొలి రోజు భారీ వసూళ్లను సాధించింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం 2వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
భోళా శంకర్ సినిమా భారీ తారాగణంతో రూపొందడంతో నిర్మాణ వ్యయం కూడా భారీగానే జరిగింది. చిరంజీవి, నటీనటులు రెమ్యునరేషన్‌తోపాటు ఈ సినిమాకు భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ప్రమోషనల్, ప్రచార కార్యక్రమాల ఖర్చు కలిపితే ఈ చిత్రం వ్యయం 140 కోట్ల రూపాయలు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో 900 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు.

భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఏపీ తెలంగాణలో భారీగా బిజినెస్ జరిగింది. ఈ సినిమా బిజినెస్ 70 కోట్ల మేర నమోదు అయింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 5 కోట్లకుపైగా, ఓవర్సీస్‌లో 7 కోట్లకుపైగా బిజినెస్ జరిగింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 82 కోట్లుగా నమోదైంది.

ఇక భోళా శంకర్ నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరిగింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ అంటే.. ఓటీటీ, శాటిలైట్ హక్కులకు మరో 80 కోట్ల బిజినెస్ అయింది. దాంతో ఈ చిత్రం బిజినెస్ ఓవరాల్‌గా 160 కోట్లుగా జరిగింది. దాంతో 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్‌తో నిర్మాత సినిమాను రిలీజ్ చేశారు.

భోళా శంకర్ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం నైజాం, ఆంధ్రలో 23 కోట్ల గ్రాస్ నమోదు చేసింది. ఓవర్సీస్‌లో తొలి రోజు 4 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 29 కోట్ల రూపాయల గ్రాస్, 20 కోట్ల షేర్ కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. అయితే గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో పోల్చుకొంటే ఈ సినిమా తక్కువ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

భోళా శంకర్ తొలి రోజు కలెక్షన్లను రెండో రోజు బాక్సాఫీస్ వద్ద నిలుపుకోలేకపోయింది. ఈ సినిమా ఇండియా వైడ్‌గా సుమారు 7 కోట్ల షేర్ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండో రోజు 8 కోట్ల షేర్, 16 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ కనిపిస్తున్నది.
ఇక భోళా శంకర్ మూవీ సినిమా బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే..
ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 80 కోట్ల కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది. రెండు రోజుల్లో ఈ చిత్రం సుమారుగా 23 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో కనీసం ఈ సినిమా మరో 60 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా లాభాల్లోకి వస్తుందా? రాదా అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











