Bhola Shankar Box office Collections: భోళాజీ మరీ ఇంత దారుణమా​? ఇది అసలు చిరంజీవి మూవీయేనా బాసూ?

మెగాస్టార్ చిరంజీవి.. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత భోళా శంకర్ సినిమాలో నటించారు. ఆగస్టు 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తో దూసుకువెళ్తోంది. ఇక ఈ చిత్రంపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ సినిమాకు స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా.. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. ఇక ఈ మూవీ 3వ రోజు కలెక్షన్ల వివరాలకు వస్తే...

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో ఖైదీ నంబర్ 150 సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆయన వరుసగా సినిమాలు చేస్తూ.. మళ్లీ ఫామ్ లోకి వచ్చేశారు. ఇక కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ.. చిరు సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ మూవీతో సూపర్ హిట్టును అందుకున్న చిరు.. తాజాగా భోళా శంకర్ సినిమాతో వచ్చారు.

Bhola Shankar Box office Collections:

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. తమన్నా చిరు సరసన నటించగా.. కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో నటించింది. ఇక ఈ మూవీ స్వర మహాతి సంగీతం అందించారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర 140 కోట్ల రూపాయలతో (ప్రచార కార్యక్రమాల ఖర్చుతో కలిపి) భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది.

Bhola Shankar Box office Collections:

భోళా శంకర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేయగా... ఏపీ, తెలంగాణలో 900 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో భారీగానే బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా 70 కోట్ల మేర బిజినెస్ నమోదు చేసినట్లు సమాచారం. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 5 కోట్లకుపైగా, ఓవర్సీస్‌లో 7 కోట్లకుపైగా బిజినెస్ జరిగిందని ట్రెడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక భోళా శంకర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

చిరంజీవి భోళా శంకర్ నాన్ థియేట్రికల్ కూడా భారీగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ హక్కులకు మరో 80 కోట్ల బిజినెస్ అయిందని తెలుస్తోంది. దాంతో ఈ చిత్రం బిజినెస్ ఓవరాల్‌ గా 160 కోట్లుగా జరిగ్గా... సినిమా టోటల్ ఖర్చు 140 కోట్లు కాగా... ఇంకా 20 కోట్ల లాభంతోనే ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర రిలీజ్ చేశారు.

ఇక ఇండియా వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే.. ఈ సినిమా రెండు రోజుల్లో నెట్ రూ.21.30 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు దేశవ్యాప్త నెట్ కలెక్షన్స్ చూసుకుంటే.. నెట్16.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో రోజు రూ. 5.05 కోట్లు నెట్ వసూలు చేసింది. ఇక మూడో రోజు కేవలం 3కోట్ల రూపాయల నెట్ వసూలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక మొత్తంగా భోళా శంకర్ మూడు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. రూ. 24.30 కోట్లు వసూలు చేయనుంది.

Bhola Shankar Box office Collections:

ఇక భోళా శంకర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఓవర్సీస్ తో కలిపుకుని మూడు రోజుల్లో రూ.29.6 కోట్ల రూపాయలు వసూలు చేయనుందని తెలుస్తోంది. అందులో రూ.21.3 కోట్ల నెట్, రూ.25.1 గ్రాస్ వసూలు చేయనుంది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా రూ.4.5 కోట్లు వసూలు చేయనుంది. అయితే చిరంజీవి గత సినిమాలు గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో పోల్చుకొంటే ఈ సినిమా తక్కువ కలెక్షన్లను నమోదు చేసిందని తెలుస్తోంది.

భోళా శంకర్ లాభాల్లోకి రావాలంటే.. ఈ మూవీ 80 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్లోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ రాబట్టిన షేర్ కేవలం పాతికకోట్లు. దీనితో ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే.. దాదాపు ఇంకో 55 కోట్ల రూపాయలు వసూలు చేయాలి. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కుకోవడం కష్టమే అని అర్థం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X