Bhola Shankar USA Collections: చిరంజీవి మూవీకి ఊహించని వసూళ్లు.. బాలయ్య సినిమాలో సగం కూడా!

స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌లో ఉన్న ఈ సీనియర్ హీరో.. ఇప్పటికీ అదే ఊపుతో దూసుకుపోతోన్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవి 'భోళా శంకర్' అనే సినిమాతో వచ్చారు. దీనికి యూఎస్‌లో వేసిన ప్రీమియర్స్‌లో ఊహించని వసూళ్లు వచ్చాయి. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

భోళా శంకర్‌గా చిరంజీవి:మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించిన చిత్రమే 'భోళా శంకర్'. ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించింది. అలాగే, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, హైపర్ ఆదిలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు.

Bhola Shankar Movie USA Premieres Box Office Colections

భోళాకు ఆ రెస్పాన్స్‌తో:మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. ముఖ్యంగా మ్యాట్నీ నుంచి బుకింగ్స్ పెరిగాయి. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు మంచిగానే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఓవర్సీస్‌లో తక్కువగా:మిగిలిన ఏరియాలతో పోల్చుకుంటే ఓవర్సీస్‌లో 'భోళా శంకర్' మూవీ సందడి మరింత ముందుగానే ప్రారంభం అయింది. అక్కడ ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ముందుగానే ఓపెన్ అయ్యాయి. కానీ, ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన మాత్రం లభించడం లేదని తెలుస్తోంది. దీనికి కారణం అక్కడ చాలా తక్కువ లొకేషన్లలోనే ఈ మూవీ విడుదల అవడమే.

Bhola Shankar Movie USA Premieres Box Office Colections

ప్రీమియర్స్ వసూళ్లు:మెహర్ రమేష్ ధర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' మూవీకి ఓవర్సీస్‌లో కాస్త తక్కువ స్పందనే వస్తోంది. ముఖ్యంగా యూఎస్‌లో ఈ సినిమాకు 309 లొకేషన్లలో ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. అక్కడ ఈ సినిమా కేవలం 308K డాలర్లను వసూలు చేసి సత్తా చాటింది. అంటే భారత కరెన్సీలో రూ. 2.54 కోట్లు గ్రాస్‌ను ఈ సినిమా వసూలు చేసింది.

Bhola Shankar Movie USA Premieres Box Office Colections

చిరంజీవి మూవీలలో:రీఎంట్రీలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలు ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ద్వారా మంచి వసూళ్లనే సాధించాయి. అయితే, 'భోళా శంకర్' మాత్రం కాస్త తక్కువగా రాబట్టిందని చెప్పాలి. ఆయన సినిమాల ప్రీమియర్స్ గమనిస్తే.. సైరాకు 560k, ఆచార్య 475k, వాల్తేరు వీరయ్య 470k, గాడ్ ఫాదర్ 155k డాలర్లను వసూలు చేశాయి. ఇప్పుడు భోళా 308K డాలర్ల రాబట్టింది.

Bhola Shankar Movie USA Premieres Box Office Colections

బాలయ్యలో సగమే:గతంలో కంటే ఇప్పుడు హీరోల మధ్య కంపారిజన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'వీర సింహా రెడ్డి' ప్రీమియర్ కలెక్షన్లతో 'భోళా శంకర్' మూవీ వసూళ్లను పోల్చి చూస్తున్నారు. బాలయ్య సినిమాకు ఏకంగా ప్రీమియర్స్ ద్వారా 708k డాలర్స్ వసూలు చేసింది. ఇప్పుడు చిరంజీవి సినిమా అందులో సగం కూడా (308K డాలర్లు) రాబట్టలేదని చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X