Bholaa Collections 100 కోట్ల క్లబ్‌లో అజయ్ దేవగన్ భోలా.. తమిళ రీమేక్‌కు కలెక్షన్ల వర్షం..!

బాలీవుడ్‌లో భోలా చిత్రం బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. అజయ్ దేవగన్ నటించిన ఈ చిత్రం మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆరంభంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన చేసినా.. ఆ తర్వాత పుంజుకొని అరుదైన మైలురాయిని చేరుకొన్నది. టబు, దీపక్ దోబ్రియాల్, సంజయ్ మిశ్రా, గజరాజ్ రావు నటించిన ఈ సినిమా గత 13 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

భోలా సినిమా బడ్జెట్, స్క్రీన్ కౌంట్:భోలా సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని సుమారు 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను దాదాపు ఇండియాలోనే 4 వేల స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌తో కలిపి ఈ చిత్రం సుమారు 4500 స్క్రీన్లలో రిలీజైంది. అజయ్ దేవగన్ కెరీర్‌లో ఇంత భారీగా సినిమాను రిలీజ్ చేయడం విశేషంగా మారింది.

Bholaa 14 days Collections worldwide: Ajay devgn movie joine in 100 crores club

భోలా తొలివారం కలెక్షన్లు :భోలా సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజున ఈ చిత్రం 11.5 కోట్ల రూపాయాలను వసూలు చేసింది. తొలివారాంతం ముగిసే సమయానికి ఇండియాలో 39 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తొలివారం ముగిసిన తర్వాత 60 కోట్ల వసూళ్లను రాబట్టింది. తొలి వారం తర్వాత బాక్సాఫీస్ వద్ద కొంత తడబాటుకు గురైంది.

గత 14 రోజుల్లో భోలా వసూళ్లు:అయితే బాలీవుడ్‌లో యావరేజ్ టాక్ సంపాదించుకొన్న భోలా చిత్రానికి వేరే సినిమాలు పోటీగా లేకపోవడం బాగా కలిసి వచ్చింది. రెండోవారంలో మౌత్ టాక్ పెరిగి స్టడీగా కలెక్షన్లు సాధించడం మొదలుపెట్టింది. రెండోవారం ముగిసిన తర్వాత అంటే.. 14వ రోజు నాటికి ఇండియాలో ఈ చిత్రం సుమారు 90 కోట్ల గ్రాస్, 75 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది.

Bholaa 14 days Collections worldwide: Ajay devgn movie joine in 100 crores club

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే? :ఇక భోలా సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియాలో 90 కోట్లకుపైగా, ఓవర్సీస్‌లో 13 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 103 కోట్ల వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా అజయ్ దేవగన్ కెరీర్‌లో అరుదైన 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇంకా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.

తమిళ సినిమా రీమేక్‌గా భోలా:ఇక భోలా చిత్రం విషయానికి వస్తే.. తమిళంలో ఘన విజయం సాధించిన కార్తీ నటించిన ఖైదీ సినిమా రీమేక్‌గా తెరకెక్కింది.ఈ చిత్రాన్ని తమిళంలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అప్పట్లో దక్షిణాదిలో భారీ కలెక్షన్లను వసూలు చేయడం గమనార్హం. ఈ చిత్రాన్ని హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా భోలాగా తెరకెక్కించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X