Bholaa Shankar Collections బాక్సాఫీస్‌పై చిరంజీవి దండయాత్ర మొదలైంది.. ఫుల్ జోష్‌లో అడ్వాన్స్ బుకింగ్
తమిళంలో విజయవంతమైన వేదాళం సినిమాకు రీమేక్‌గా దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రం భోళా శంకర్. మెగాస్టార్ చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన రిలీజ్ కానున్నది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భోళా శంకర్ చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రాజెక్టు క్రేజీగా మారింది. లుక్స్, టీజర్లు, పాటలు రిలీజ్ తర్వాత ఈ సినిమా భారీగా అంచనాలు పెంచింది. అంచనాలకు తగినట్టే సినిమా రేంజ్ కూడా పెరిగిపోయింది.

ఇక భోళా శంకర్ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చే లీక్స్ ఈ ప్రాజెక్టుపై మరింత అంచనాలు, క్రేజ్ పెంచింది. పవన్ కల్యాణ్ అభిమానిగా చిరంజీవి కనిపించబోతున్నారనే వార్తకు ఆయన ఇచ్చిన లీక్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. పవర్ స్టార్ మేనరిజంతో ఇచ్చిన లుక్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ఇలాంటి అంశాల మధ్య భోళా శంకర్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది.

తెలుగు రాష్ట్రాల్లో భోళా శంకర్ అడ్వాన్స్ బుకింగ్ శుక్రవారం ఆగస్టు 4వ తేదీన మొదలైంది. అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ రెస్సాన్స్ లభించడమే కాకుండా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తొలి రోజే భారీగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.

ఇక భోళా శంకర్ సినిమా ఓవర్సీస్‌లో భారీ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేస్తున్నది. అమెరికాలో ప్రీమియర్ కోసం రిలీజ్ చేసిన అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ప్రస్తుతం 170 లోకేషన్లలో 480 కి పైగా షోల కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. ఇంకా ఆరు రోజులు ఉండగానే.. 82K డాలర్లను వసూలు చేసింది.

భోళా శంకర్ సినిమాకు యూకేలో కూడా భారీ కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబడుతున్నది. ఇప్పటి వరకు 136 షోల కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. దాదాపు 7000 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు 60 లక్షల రూపాయలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











