twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bhool Bhulaiyaa 2: బాలీవుడ్ పరువు నిలబెట్టిన కార్తిక్ ఆర్యన్.. రెండవ వారం కూడా అదే దూకుడు

    |

    చాలా రోజుల తరువాత బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. అక్షయ్ కుమార్ నటించిన భూల్ భూలయ్యా సినిమాకు కొనసాగింపుగా వచ్చిన భూల్ భూలయ్యా 2లో హీరోగా కార్తీక్ ఆర్యన్ నటించాడు. ఇక రెండవ వారం కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం తగ్గకుండా వసూళ్లను అందుకుంటోంది. కియారా అద్వానీ మేయిన్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాలో టబు మరొక ముఖ్యమైన పాత్రలో నటించింది.

    ఇక విడుదలైన మొదటి రోజు నుంచి భూల్ భూలయ్యా 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది. హిందీ సినిమాల మార్కెట్ పూర్తిగా తగ్గిపోయిందని అనుకుంటున్న సమయంలో ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద సినిమా దాదాపు రూ. 122 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. రెండవ వారంలో కూడా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.

    Bhool Bhulaiyaa 2 box office collection day 10

    రెండవ ఆదివారం నాడు సినిమా రూ. 13 కోట్లను రబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు టోటల్ గా 122కోట్లను అందుకుంది. చూస్తుంటే ఈ వారం సినిమా 150కోట్ల మార్కును అందుకోవచ్చని సమాచారం. హారర్ కామెడీ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ నటించిన విధానం ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టైటిల్ ట్రాక్ ముందుగానే సినిమాపై ఒక మంచి పాజిటివ్ టాక్ ను క్రియేట్ చేసింది. ఇక యువ హీరో కార్తీక్ ఆర్యన్ కెరీర్ లోనే ఈ సినిమా అత్యదిక వసూళ్లను అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

    ఇక ఈ ఏడాది రెండవ వారంలో అత్యధిక వసూళ్లను అందుకున్న బాలీవుడ్ సినిమాల్లో భూల్ భూలయ్యా 2 రెండవ స్థానంలో నిలిచింది. ద కాశ్మీర్ ఫైల్స్ రూ.70.15కోట్లు అందుకోగా..ఆ తరువాత భూల్ భూలయ్యా 2 30.64కోట్లు సాధించింది. ఇక ఆలియా భట్ గంగుభాయ్ ఖతీయవాడి 23.29కోట్లతో మూడవ స్థానంలో ఉంది. ఇక డబ్బింగ్ సినిమాలతో పోలిస్తే మాత్రం RRR, KGF 2 కంటే భూల్ భూలయ్యా సాధించిన సెకండ్ వీక్ కలెక్షన్స్ చాలా తక్కువ. మరి సోమవారం నుంచి ఈ సినిమా ఇంకా ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

    English summary
    Bhool Bhulaiyaa 2 box office collection day 10
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X