Bhool Bhulaiyaa 2 Collections 6 రోజు కూడా తగ్గని కలెక్షన్ల జోష్. 100 కోట్లకు చేరువగా కియారా అద్వానీ మూవీ

బాలీవుడ్ యువ హీరో, హీరోయిన్లు కియారా అద్వానీ, కార్తీక్ ఆర్యన్, సీనియర్ నటి టబు నటించిన భూల్ బులయ్యా 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా సందడి చేస్తున్నది. లాక్‌డౌన్ తర్వాత బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన నేపథ్యంలో ఈ చిత్రం భారీగా వసూళ్లను నమోదు చేయడం హిందీ ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది. ఈ చిత్రాన్ని టీ సిరీస్, సీనీ 1 స్టూడియోస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు భూషణ్ కుమార్, మురాద్ ఖేతన్, అంజుమ్ కేతానీ, కిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రం 6వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..

భూల్ బులయ్యా చిత్రం తొలి వారాంతంలో 55.96 కోట్లు వసూలు చేసింది. అదే జోష్‌ను తొలి వారాంతం తర్వాత కూడా చూపించింది. దాంతో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌కు చేరేందుకు సిద్ధపడింది. తొలివారంలో శుక్రవారం 14.11 కోట్లు, శనివారం 18.34 కోట్లు, ఆదివారం 23.51 కోట్లు, సోమవారం 10.75 కోట్లు, మంగళవారం 8.51 కోట్లు, బుధవారం 8.51 కోట్లు సాధించడంతో ఆరో రోజున ఈ చిత్రం 84.78 కోట్లు రాబట్టింది.

 Bhool Bhulaiyaa 2 movie 6 days Collections: Kiara Advani movie near to 100 crores

బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద 6వ రోజున భారీ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితా ఇలా ఉంది. భారీ వసూళ్లు సాధించిన వివాదాస్పద చిత్రం ది కశ్మీర్ ఫైల్స్ ఆరో రోజున 19.05 కోట్లు సాధించింది. ఇక భూల్ భులయ్యా చిత్రం ఆరో రోజున 8.51 కోట్లు రాబట్టింది. అలాగే అలియాభట్ నటించిన గంగూభాయ్ కతియావాడి చిత్రం 6.21 కోట్లు వసూలు చేసింది.

ఇక గురువారం భూల్ భులయ్యా చిత్రం 92 కోట్ల వసూళ్లను నమోదు చేసే ఛాన్స్ ఉంది. మరో రెండు రోజుల్లో 100 కోట్లగ్రాస్ కలెక్షన్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X