Don't Miss!
- Sports
IND vs SA: రెండో ఇన్నింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ విఫలం.. భారీ ఆధిక్యం దిశగా భారత్!
- News
ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్ని గ్రామస్తులు: ఒకరు మాజీ బీజేపీ మైనార్టీ నేత, రూ. 5 లక్షల రివార్డ్
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 03 నుండి జూలై 9వ తేదీ వరకు..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
Bhool Bhulaiyaa 2 Collections 6 రోజు కూడా తగ్గని కలెక్షన్ల జోష్. 100 కోట్లకు చేరువగా కియారా అద్వానీ మూవీ
బాలీవుడ్ యువ హీరో, హీరోయిన్లు కియారా అద్వానీ, కార్తీక్ ఆర్యన్, సీనియర్ నటి టబు నటించిన భూల్ బులయ్యా 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా సందడి చేస్తున్నది. లాక్డౌన్ తర్వాత బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన నేపథ్యంలో ఈ చిత్రం భారీగా వసూళ్లను నమోదు చేయడం హిందీ ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది. ఈ చిత్రాన్ని టీ సిరీస్, సీనీ 1 స్టూడియోస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు భూషణ్ కుమార్, మురాద్ ఖేతన్, అంజుమ్ కేతానీ, కిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రం 6వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..
భూల్ బులయ్యా చిత్రం తొలి వారాంతంలో 55.96 కోట్లు వసూలు చేసింది. అదే జోష్‌ను తొలి వారాంతం తర్వాత కూడా చూపించింది. దాంతో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌కు చేరేందుకు సిద్ధపడింది. తొలివారంలో శుక్రవారం 14.11 కోట్లు, శనివారం 18.34 కోట్లు, ఆదివారం 23.51 కోట్లు, సోమవారం 10.75 కోట్లు, మంగళవారం 8.51 కోట్లు, బుధవారం 8.51 కోట్లు సాధించడంతో ఆరో రోజున ఈ చిత్రం 84.78 కోట్లు రాబట్టింది.

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 6వ రోజున భారీ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితా ఇలా ఉంది. భారీ వసూళ్లు సాధించిన వివాదాస్పద చిత్రం ది కశ్మీర్ ఫైల్స్ ఆరో రోజున 19.05 కోట్లు సాధించింది. ఇక భూల్ భులయ్యా చిత్రం ఆరో రోజున 8.51 కోట్లు రాబట్టింది. అలాగే అలియాభట్ నటించిన గంగూభాయ్ కతియావాడి చిత్రం 6.21 కోట్లు వసూలు చేసింది.
ఇక గురువారం భూల్ భులయ్యా చిత్రం 92 కోట్ల వసూళ్లను నమోదు చేసే ఛాన్స్ ఉంది. మరో రెండు రోజుల్లో 100 కోట్లగ్రాస్ కలెక్షన్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తున్నది.