Bhool Bhulaiyaa Collections: దుమ్మురేపుతున్న భూల్ భూలయ్య 3.. 2 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

హిందీ సినిమా రంగంలో హారర్ కామెడీగా రూపొందిన భూల్ భులయ్యా 3 సినిమాలో కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, మాధురీ దీక్షిత్, త్రిప్తి డిమ్రీ, విజయ్ రాజ్, రాజ్ పాల్ యాదవ్ తదితరులు నటించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు టీ సిరీస్, సినీ1 స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. నవంబర్ 1వ తేదీన రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొంటున్నది. ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ప్రముఖ నిర్మాతలు భూషన్ కుమార్, కృషన్ కుమార్ ఈ సినిమాను సుమారుగా 150 కోట్ల రూపాయలతో నిర్మించారు. సందీప్ శిరోద్కర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు మంచి స్పందనను కూడగట్టుకొన్నాయి. అలాగే ప్రమోషన్ కార్యక్రమాలు ఊపొందుకోవడం కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాల నెలకొనడంతో అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదైంది.

Bhool Bhulaiyaa 3 Box Office Collections Worldwide Vidya Balan Movie heading to 100 Crores

భూల్ భులయ్యా, భూల్ భులయ్యా 2 సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత మూడో సీక్వెల్‌గా వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్ భారీగానే జరిగింది. విద్యా బాలన్, కార్తీక్ ఆర్యన్ చేసిన ప్రమోషన్స్‌‌కు మంచి స్పందన రావడంతో ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చాయి.

భూల్ భులయ్యా 3 చిత్రం దీపావళీ సెలవులను పాజిటివ్‌గా మలచుకొని భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమా తొలి రోజు సుమారుగా 36 కోట్ల రూపాయలు ఇండియాలో, ఓవర్సీస్‌లో ఈ సినిమా 8 కోట్ల వరకు కలెక్షన్లను సాధించింది. ధాంతో ఈ మూవీ ఫస్ట్ డే సుమారుగా 44 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Bhool Bhulaiyaa 3 Box Office Collections Worldwide Vidya Balan Movie heading to 100 Crores

విద్యాబాలన్ సినిమా రెండో రోజు కూడా భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ఇండియాలో 2వ రోజు 28 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది. నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కూడా నిలకడగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం రెండో రోజు ఓవర్సీస్ కలెక్షన్లతో కలిపి 34 కోట్ల రూపాయలు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

భూల్ భులయ్యా 3 చిత్రం ట్రేడ్ వర్గాల అంచనాలకు అనుగుణంగానే కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా రెండు రోజుల్లో 78 కోట్ల రూపాయలు రాబట్టింది. తొలివారాంతం ముగిసేలోగా ఈ సినిమా మొత్తంగా 100 కోట్ల మార్కును దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X