Bhool Bhulaiyaa Box Office: 150 కోట్లకు చేరువగా భూల్ బులయ్యా 3.. సింగం అగైన్‌ను మించి..!

హిందీ సినిమా రంగంలో హారర్ కామెడీగా రూపొందిన భూల్ భులయ్యా 3 సినిమాలో కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, మాధురీ దీక్షిత్, త్రిప్తి డిమ్రీ, విజయ్ రాజ్, రాజ్ పాల్ యాదవ్ తదితరులు నటించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు టీ సిరీస్, సినీ1 స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. నవంబర్ 1వ తేదీన రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొంటున్నది. ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ప్రముఖ నిర్మాతలు భూషన్ కుమార్, కృషన్ కుమార్ ఈ సినిమాను సుమారుగా 150 కోట్ల రూపాయలతో నిర్మించారు. సందీప్ శిరోద్కర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు మంచి స్పందనను కూడగట్టుకొన్నాయి. అలాగే ప్రమోషన్ కార్యక్రమాలు ఊపొందుకోవడం కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాల నెలకొనడంతో అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదైంది.

Bhool Bhulaiyaa 3 Box Office Collections Worldwide Vidya Balan Movie Inching towards 150cr

విద్యా బాలన్, కార్తీక్ ఆర్యన్ చేసిన ప్రమోషన్స్‌కు క్రేజ్ లభించడంతో ఈ సినిమాను రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇండియాలో ఈ మూవీని 3000 థియేటర్లలో ఓవర్సీస్‌లో ఈ సినిమాను మరో 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో వసూళ్లను భారీగా రాబడుతున్నది.

భూల్ భులయ్యా 3 చిత్రం తొలి రోజున రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. ఈ చిత్రం ఇండియాలో 40 కోట్ల రూపాయలు రాబట్టింది. రెండో రోజున కూడా అదే జోష్‌ను కొనసాగించి 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మూడో రోజు కూడా ఈ సినిమా భారీగా 38 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 118 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది.

ఇక ఈ మూవీకి ఓవర్సీస్‌లో భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా నార్త్ అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ కంట్రీస్, సింగపూర్, మలేషియా, న్యూజిలాండ్ దేశాల్లో మంచి కలెక్షన్లను రాబట్టింది. ధాంతో ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 25 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

భూల్ భులయ్యా 3 చిత్రం 150 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ యాత్రను చేపట్టింది. ఈ సినిమా ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి మొత్తంగా 140 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
దాంతో ఈ సినిమా ఇంకా రానున్న రోజుల్లో భారీగానే వసూలు చేయాల్సి ఉంటుంది. సింగం అగైన్ మూవీతో పోల్చితే చాలా తక్కువ స్క్రీన్లలో రిలీజ్ అయింది. అయినా ఆ సినిమాతో పోటీ పడుతూ కలెక్షన్లను రాబడుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X