150 కోట్లకు చేరువగా బూత్ బంగ్లా.. అక్షయ్ కుమార్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సీనియర్ హీరోయిన్ టబు జంటగా నటించిన ఫాంటసీ, హారర్ కామెడీ భూత్ బంగ్లా. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వమికా గబ్బీ, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్ గుప్తా, మనోజ్ జోషి, అస్రానీ, రాజేశ్ శర్మ తదితరులు నటించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఈ సినిమాను ఏక్తా కపూర్, శోభా కపూర్, అక్షయ్ కుమార్ నిర్మించారు.

ఈ సినిమా సాంకేతిక నిపుణుల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: దివాకర్ మణి, ఎడిటింగ్: ఎంఎస్ అయ్యప్పన్ నాయర్, మ్యూజిక్: ప్రీతమ్, రోని రాఫెల్ అందించారు. కామెడీ, హారర్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 17వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమిటి? ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Bhoot Bangla Day 7 Box office

భూత్ బంగ్లా సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అక్షయ్ కుమార్, వమికా గబ్బీ, టబు, పరేశ్ రావెల్, రాజ్ పాల్ యాదవ్ లాంటి స్టార్ యాక్టర్ల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 3200 కుపైగా స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 180 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ చిత్రంపై బజ్ పాజిటివ్‌గా క్రియేట్ కావడంతో రిలీజ్‌కు ఒక రోజు ముందే ప్రీమియర్లను ప్రదర్శించారు. ప్రీమియర్ల ద్వారా ఈ చిత్రం 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజు 12.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 19 కోట్ల రూపాయలు, మూడో రోజు 23 కోట్ల రూపాయలతో తొలివారంతం ఈ సినిమా భారీగా వసూళ్లను నమోదు చేసింది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం 58 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

తొలివారాంతం తర్వాత కూడా బూత్ బంగ్లా సినిమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లను రాబట్టింది. 4వ రోజు ఈ చిత్రం 6.75 కోట్ల రూపాయలు, 5వ రోజు 8 కోట్ల రూపాయలు, 6వ రోజు 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం దాదాపు 80 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమాకు ఓవర్సీస్‌లో కూడా మంచి స్పందన లభించింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 31.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఇండియాలో 80 కోట్ల రూపాయల నెట్, 94 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఓవర్సీస్ కలెక్షన్లతో కలిపి ఈ సినిమా 125 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం 7వ రోజు 3 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా 128 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను నమోదు చేస్తుంది అని పేర్కొన్నారు.

అయితే ఈ చిత్రం రెండో వారాంతం ముగిసే సమయానికి ఈ చిత్రం 150 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు అక్షయ్ కుమార్ నటించిన 12 చిత్రాలకుపైగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ సినిమాతో మరోసారి అక్షయ్ కమ్ బ్యాక్ ఇచ్చారనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X