Bhooth Bangla Day 1 Box Office: భూత్ బంగ్లా తొలి రోజు కలెక్షన్లు ఎంత? అక్షయ్ కుమార్ హిట్ కొట్టేనా?
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సీనియర్ హీరోయిన్ టబు జంటగా నటించిన ఫాంటసీ, హారర్ కామెడీ భూత్ బంగ్లా. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వమికా గబ్బీ, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్ గుప్తా, మనోజ్ జోషి, అస్రానీ, రాజేశ్ శర్మ తదితరులు నటించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఈ సినిమాను ఏక్తా కపూర్, శోభా కపూర్, అక్షయ్ కుమార్ నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక నిపుణుల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: దివాకర్ మణి, ఎడిటింగ్: ఎంఎస్ అయ్యప్పన్ నాయర్, మ్యూజిక్: ప్రీతమ్, రోని రాఫెల్ అందించారు. కామెడీ, హారర్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 17వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమిటి? ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

భూత్ బంగ్లా సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అక్షయ్ కుమార్, వమికా గబ్బీ, టబు, పరేశ్ రావెల్, రాజ్ పాల్ యాదవ్ లాంటి స్టార్ యాక్టర్ల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 180 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలంటే కనీసం 250 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుందని అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
అక్షయ్ కుమార్ సినిమా కోసం ప్రమోషన్స్ భారీగా నిర్వహించారు. దాంతో ఈ సినిమాపై బజ్ భారీగా క్రియేట్ అయింది. ఆ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. దాంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయని, సమ్మర్ సెలవుల్లో ఫ్యామిలీకి ఎంటర్‌టైన్‌మెంట్ మూవీగా నిలుస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.
భూత్ బంగ్లా సినిమా ఒక రోజు ముందే ప్రీమియర్లు మొదలువుతున్నాయి. గురువారం సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్లు ప్రారంభించారు. ఈ చిత్రం పెయిడ్ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. దాంతో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు కూడా భారీగా ుండే అవకాశం ఉంది. ఈ సినిమా ఫస్ట్ డే ప్రీమియర్లతో కలిపి 15 కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అక్షయ్ కుమార్, టబు జంటగా నటించిన ఈ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షోకు మంచి రెస్పాన్స్ వస్తే.. ఈ సినిమా వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 50 కోట్ల మేర కలెక్షన్లు వసూలు చేస్తుందనే అంచనాతో చిత్ర యూనిట్ ఉంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications