Bhooth Bangla Day 2 Collections: భూత్ బంగ్లా వసూళ్ల జోరు.. అక్షయ్ కుమార్ మూవీకి 2వ రోజు ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ సూపర్‌‌స్టార్ అక్షయ్ కుమార్, సీనియర్ నటి టబు జంటగా నటించిన మూవీ భూత్ బంగ్లా. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఈ సినిమాను ఏక్తా కపూర్, శోభా కపూర్, అక్షయ్ కుమార్ నిర్మించారు. వామికా గబ్బీ, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్ గుప్తా, మనోజ్ జోషి, అస్రానీ, రాజేశ్ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్‌గా, ఎంఎస్ అయ్యప్పన్ నాయర్ ఎడిటర్‌గా, ప్రీతమ్ - రోని సంగీత దర్శకత్వం వహించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 17న భూత్ బంగ్లా మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమిటి? ఈ సినిమా రెండో రోజు కలెక్షన్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Also Read
సూపర్‌స్టార్ ఇంటికి కోడలిగా అక్కినేని హీరోయిన్? దిమ్మతిరిగేలా నటి తల్లి కౌంటర్
సూపర్‌స్టార్ ఇంటికి కోడలిగా అక్కినేని హీరోయిన్? దిమ్మతిరిగేలా నటి తల్లి కౌంటర్

నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి భూత్ బంగ్లా మూవీని దాదాపు 180 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లుగా బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా బ్రేక్ఈవెన్ కావాలంటే 180 కోట్ల రూపాయలు వసూలు చేయాలని ట్రేడ్ పండితులు నిర్దేశించారు. బ్లాక్‌బస్టర్ కావాలంటే దాదాపు 250 కోట్లు రాబట్టాలని పేర్కొన్నారు.

Bhooth Bangla Day 2 Expected Box Office Collections Worldwide Akshay Kumar s Movie eye on 50 crores mark

భూత్ బంగ్లా తొలిరోజు కలెక్షన్స్
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో భూత్ బంగ్లా మూవీకి తొలి రోజు మంచి ఓపెనింగ్స్ లభించాయి. ప్రీమియర్స్‌‌లో 3.75 కోట్ల రూపాయలు, తొలిరోజున 12.25 కోట్ల రూపాయల నెట్.. 19.20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. మహారాష్ట్రలో 4.64 కోట్ల రూపాయలు, ఢిల్లీలో 3 కోట్ల రూపాయలు, గుజరాత్‌లో 2.05 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్‌లో 1.28 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.34 కోట్ల రూపాయలు, రాజస్థాన్‌లో 90 లక్షల రూపాయలు, తెలంగాణలో 68 లక్షల రూపాయలు, తమిళనాడులో 24 లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 6 లక్షల రూపాయలు, కేరళలో 6 లక్షల రూపాయలు వసూలు చేసింది.

Recommended For You
Rakasa Closing Collections: రాకాస క్లోజింగ్ కలెక్షన్స్.. నిహారిక కొణిదెల మూవీకి లాభమెంత? నష్టమెంత?
Rakasa Closing Collections: రాకాస క్లోజింగ్ కలెక్షన్స్.. నిహారిక కొణిదెల మూవీకి లాభమెంత? నష్టమెంత?

భూత్ బంగ్లా ఓవర్సీస్ కలెక్షన్స్
ఓవర్సీస్ మార్కెట్‌లోనూ భూత్ బంగ్లాకు మెరుగైన వసూళ్లు వచ్చాయి. నార్త్ అమెరికా, యూరప్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, గల్ఫ్, సింగపూర్ తదితర దేశాలలో ప్రీమియర్స్‌తో కలిపి తొలిరోజున 548K డాలర్లు (భారత కరెన్సీలో 5 కోట్ల రూపాయలు) రాబట్టింది. భారత్‌‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి భూత్ బంగ్లాకు తొలిరోజున వరల్డ్ వైడ్‌గా 24 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి.

You May Also Like
'16 ఏళ్ల వయసులో దానికి బానిసనయ్యా ... రెండు సార్లు కావాల్సిందే’
'16 ఏళ్ల వయసులో దానికి బానిసనయ్యా ... రెండు సార్లు కావాల్సిందే’

భూత్ బంగ్లా రెండో రోజు వసూళ్ల అంచనా
పాజిటివ్ రివ్యూలు, హార్రర్ కామెడీ కథాంశం, వీకెండ్ కారణంగా భూత్ బంగ్లాకు శనివారం మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. శనివారం 3100 స్క్రీన్‌లలో, 12500 షోలు ప్రదర్శితమవుతాయని అంచనా వేస్తున్నారు. రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్‌లో 2.73 లక్షల టికెట్లు సేల్ అయినట్లుగా తెలుస్తోంది. తద్వారా శనివారం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికే 7.67 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది.

'అలా మద్యానికి బానిసనయ్యా.. ఆ పరిస్థితుల్లో తాగుడుకు అలవాటు పడ్డా’
'అలా మద్యానికి బానిసనయ్యా.. ఆ పరిస్థితుల్లో తాగుడుకు అలవాటు పడ్డా’

రెండో రోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఇండియాలో 4251 షోలు ప్రదర్శితమై 16 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. తద్వారా ఇప్పటి వరకు 2.34 కోట్ల రూపాయల నెట్ వసూలైనట్లు సాక్‌నిక్ పేర్కొంది. రెండో రోజు భూత్ బంగ్లా మూవీ ఇండియాలో 20 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 25 కోట్ల రూపాయలు రాబడుతుందని భావిస్తున్నారు. దాంతో కేవలం రెండ్రోజుల్లోనే అక్షయ్ కుమార్ మూవీ 50 కోట్ల క్లబ్‌లో అడుగుపెడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read more about: bhooth bangla akshay kumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X