Bhooth Bangla Day 3 Collections: భూత్ బంగ్లాకు వసూళ్ల ఊపు.. అక్షయ్ కుమార్ మూవీకి ఎన్ని కోట్లంటే?

బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఏక్తా కపూర్, శోభా కపూర్, అక్షయ్ కుమార్ నిర్మించిన చిత్రం భూత్ బంగ్లా. ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, సీనియర్ నటి టబు జంటగా నటించారు. వామికా గబ్బీ, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్ గుప్తా, మనోజ్ జోషి, అస్రానీ, రాజేశ్ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్‌గా, ఎంఎస్ అయ్యప్పన్ నాయర్ ఎడిటర్‌గా, ప్రీతమ్ - రోని సంగీత దర్శకత్వం వహించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 17న భూత్ బంగ్లా మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమిటి? ఈ సినిమా రెండో రోజు కలెక్షన్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి భూత్ బంగ్లా మూవీని దాదాపు 180 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లుగా బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా బ్రేక్ఈవెన్ కావాలంటే 180 కోట్ల రూపాయలు వసూలు చేయాలని ట్రేడ్ పండితులు నిర్దేశించారు. బ్లాక్‌బస్టర్ కావాలంటే దాదాపు 250 కోట్లు రాబట్టాలని పేర్కొన్నారు.

Bhooth Bangla Day 3 Expected Box Office Collections Worldwide Akshay Kumar s Movie heading towards 100 crores mark

భూత్ బంగ్లా రెండు రోజుల కలెక్షన్స్
అక్షయ్ కుమార్ మూవీకి ప్రీమియర్స్‌లో 3.75 కోట్ల రూపాయలు, తొలిరోజున 12.25 కోట్ల రూపాయలు, రెండో రోజున 19 కోట్ల రూపాయలు వసూలైంది. ఇండియాలో రెండ్రోజుల వరకు 38.07 కోట్ల రూపాయల నెట్.. 42.67కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే రెండ్రోజుల్లో భూత్ బంగ్లా మూవీ ఇండియాలో 47.25 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

రెండు రోజుల వరకు అక్షయ్ కుమార్ మూవీకి ఢిల్లీలో 7.60 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్‌లో 2.97 కోట్ల రూపాయలు, పంజాబ్‌లో 1.23 కోట్ల రూపాయలు, రాజస్థాన్‌లో 2 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్‌లో 1.58 కోట్ల రూపాయలు, వెస్ట్ బెంగాల్‌లో 2.10 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 2.85 కోట్ల రూపాయలు, తెలంగాణలో 1.53 కోట్ల రూపాయలు, తమిళనాడులో 49 లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 14 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది.

భూత్ బంగ్లా ఓవర్సీస్ కలెక్షన్స్
అక్షయ్ కుమార్ మూవీకి భారత్‌తో సమానంగా ఓవర్సీస్‌లోనూ భూత్ బంగ్లాకు కలెక్షన్స్ వస్తున్నాయి. నార్త్ అమెరికాతో పాటు గల్ఫ్, సింగపూర్, మలేషియా, యూకే, యూరప్ తదితర దేశాలలో కలిపి ఇప్పటి వరకు భూత్ బంగ్లా మూవీకి ఓవర్సీస్‌లో 2.02 మిలియన్ డాలర్లు (18.85 కోట్ల రూపాయలు) వసూలైంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు భూత్ భంగ్లా మూవీ వరల్డ్ వైడ్‌గా 62 కోట్ల రూపాయలు రాబట్టింది.

భూత్ బంగ్లా 3వ రోజు వసూళ్ల అంచనా
వీకెండ్ కావడంతో అక్షయ్ కుమార్ మూవీకి బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ఆదివారం ఇప్పటి వరకు బుక్ మై షోలో 3.7 లక్షల టికెట్లు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. దాంతో కేవలం అడ్వాన్స్ బుకింగ్‌లోనే 3వ రోజు 10.03 కోట్ల రూపాయలు వసూలు చేశాడు అక్షయ్. మూడో రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు భూత్ బంగ్లా మూవీకి ఇండియాలో 4292 షోలు ప్రదర్శించబడి.. 25 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ పేర్కొంది. ఆదివారం ఇప్పటి వరకు ఇండియాలో 4.20 కోట్ల రూపాయల నెట్ వసూలైనట్లుగా తెలిపింది. 3వ రోజు భూత్ బంగ్లా మూవీ ఇండియాలో 22 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 30 కోట్ల రూపాయల చొప్పున వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో వరల్డ్ వైడ్‌గా మూడు రోజుల్లో 90 కోట్ల మార్క్ చేరుకుంటుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X