Bhooth Bangla Day 4 Collections: 100 కోట్లకు చేరువగా భూత్ బంగ్లా.. అక్షయ్ మూవీకి 4వ రోజు ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ భూత్ బంగ్లా. లవ్, రొమాన్స్, హార్రర్ కామెడీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఏక్తా కపూర్, శోభా కపూర్, అక్షయ్ కుమార్ నిర్మించారు. టబు, వామికా గబ్బీ, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్ గుప్తా, మనోజ్ జోషి, అస్రానీ, రాజేశ్ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్‌గా, ఎంఎస్ అయ్యప్పన్ నాయర్ ఎడిటర్‌గా, ప్రీతమ్ - రోని సంగీత దర్శకత్వం వహించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 17న భూత్ బంగ్లా మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమిటి? ఈ సినిమా నాలుగో రోజు కలెక్షన్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి భూత్ బంగ్లా మూవీని దాదాపు 180 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లుగా బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా బ్రేక్ఈవెన్ కావాలంటే 180 కోట్ల రూపాయలు వసూలు చేయాలని ట్రేడ్ పండితులు నిర్దేశించారు. బ్లాక్‌బస్టర్ కావాలంటే దాదాపు 250 కోట్లు రాబట్టాలని పేర్కొన్నారు.

బూత్ బంగ్లా 3 రోజుల కలెక్షన్స్
అక్షయ్ కుమార్ మూవీకి ప్రీమియర్స్‌లో 3.75 కోట్ల రూపాయలు, తొలిరోజున 12.25 కోట్ల రూపాయలు, రెండో రోజున 19 కోట్ల రూపాయలు, మూడో రోజున 23 కోట్ల రూపాయలు వసూలైంది. ఇండియాలో మూడు రోజుల వరకు 58 కోట్ల రూపాయల నెట్.. 69.37 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే భూత్ బంగ్లాకు ఇండియాలో మూడు రోజుల వరకు 77.45 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
మూడు రోజుల వరకు ఢిల్లీలో 12.25 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్‌లో 5.19 కోట్ల రూపాయలు, పంజాబ్‌లో 2.08 కోట్ల రూపాయలు, రాజస్థాన్‌లో 3.47 కోట్ల రూపాయలు, గుజరాత్‌తో 8.03 కోట్ల రూపాయలు, మహారాష్ట్రలో 16.92 కోట్ల రూపాయలు, పశ్చిమ బెంగాల్‌లో 3.74 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 4.65 కోట్ల రూపాయలు, తెలంగాణలో 2.35 కోట్ల రూపాయలు, తమిళనాడులో 77 లక్షల రూపాయలు, ఆంధ్రాలో 24 లక్షల రూపాయలు, కేరళలో 18 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది.
భూత్ బంగ్లా ఓవర్సీస్ కలెక్షన్స్
అక్షయ్ కుమార్ మూవీకి నార్త్ అమెరికాలో ఆదివారం వరకు 850K డాలర్లు (భారత కరెన్సీలో 8 కోట్ల రూపాయలు)కు పైగా వసూలైనట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. యూరప్, యూకే, గల్ఫ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా తదితర దేశాలలో కలిపి భూత్ బంగ్లా మూవీకి ఇప్పటి వరకు 2.83 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 26.41 కోట్ల రూపాయలు) వసూలైనట్లుగా తెలుస్తోంది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 96 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది.
భూత్ బంగ్లా 4వ రోజు వసూళ్ల అంచనా
ఫస్ట్ వీకెండ్‌లో దుమ్మురేపిన భూత్ బంగ్లాకు ఈరోజు సోమవారం టెస్ట్ ఎదురుకానుంది. వర్కింగ్ డే కావడంతో బుకింగ్స్ పడిపోయే అవకాశం కనిపిస్తోంది. 4వ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇండియాలో ఇప్పటి వరకు 4791 షోలు ప్రదర్శితమై.. 10 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ పేర్కొంది. ఇప్పటి వరకు ఇండియాలో 1.15 కోట్ల రూపాయలు నికర వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. 4వ రోజు ఇండియాలో 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 15 కోట్ల రూపాయల రేంజ్‌లో అక్షయ్ కుమార్ మూవీ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ్టీ వసూళ్లతో భూత్ బంగ్లా మూవీ 100 కోట్ల రూపాయల క్లబ్‌లో అడుగుపెట్టనుంది.


Click it and Unblock the Notifications



