Bhooth Bangla Box Office: షారుఖ్, సల్మాన్‌లు వెనక్కి.. బాలీవుడ్‌లో ఏకైక హీరోగా అక్షయ్ సరికొత్త రికార్డ్!

బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ హీరో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన మూవీ భూత్ బంగ్లా. బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఏక్తా కపూర్, శోభా కపూర్, అక్షయ్ కుమార్ నిర్మించారు. టబు, వామికా గబ్బీ, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్ గుప్తా, మనోజ్ జోషి, అస్రానీ, రాజేశ్ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్‌గా, ఎంఎస్ అయ్యప్పన్ నాయర్ ఎడిటర్‌గా, ప్రీతమ్ - రోని సంగీత దర్శకత్వం వహించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 17న భూత్ బంగ్లా మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమిటి? ఈ సినిమా 9వ రోజు కలెక్షన్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి భూత్ బంగ్లా మూవీని దాదాపు 180 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లుగా బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా బ్రేక్ఈవెన్ కావాలంటే 180 కోట్ల రూపాయలు వసూలు చేయాలని ట్రేడ్ పండితులు నిర్దేశించారు. బ్లాక్‌బస్టర్ కావాలంటే దాదాపు 250 కోట్లు రాబట్టాలని పేర్కొన్నారు.

Bhooth Bangla Day 9 Expected Box Office Collections Worldwide Akshay Kumar Creates History With 20 Films In 100 Crore Club

భూత్ బంగ్లా 8 రోజుల కలెక్షన్స్
అక్షయ్ కుమార్ మూవీకి ఇండియాలో ప్రీమియర్స్ ద్వారా 3.75 కోట్ల రూపాయలు, తొలి రోజున 12.25 కోట్ల రూపాయలు, రెండో రోజున 19 కోట్ల రూపాయలు, మూడో రోజున 23 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 6.75 కోట్ల రూపాయలు, ఐదో రోజున 8 కోట్ల రూపాయలు, ఆరో రోజున 6.15 కోట్ల రూపాయలు, ఏడో రోజున 5.50 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 5.75 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో ఇప్పటి వరకు 90.15 కోట్ల రూపాయల నెట్.. 10.7.20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

తొలి వారం వరకు మహారాష్ట్రలో 24.64 కోట్ల రూపాయలు, ఢిల్లీలో 18.20 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్‌లో 8.40 కోట్ల రూపాయలు, గుజరాత్‌లో 12.32 కోట్ల రూపాయలు, రాజస్థాన్‌లో 5.66 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.91 కోట్ల రూపాయలు, తెలంగాణలో 3.35 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.15 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 37 లక్షల రూపాయలు, కేరళలో 26 లక్షల రూపాయలు చొప్పున రాబట్టింది.

ఓవర్సీస్‌లో భూత్ బంగ్లా కలెక్షన్స్
నార్త్ అమెరికాలో శుక్రవారం వరకు 1.61 మిలియన్ డాలర్లు (15 కోట్ల రూపాయలు) రాబట్టింది భూత్ బంగ్లా. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, యూకే, గల్ఫ్, సింగపూర్ దేశాలలో మరో 22 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. మొత్తంగా ఓవర్సీస్‌లో అక్షయ్ కుమార్ మూవీ 37.50 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 145 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

భూత్ బంగ్లా 9వ రోజు వసూళ్లు అంచనా
సమ్మర్ సెలవులు, వీకెండ్‌కి తోడు థియేటర్ల‌లో ఎలాంటి సినిమాలు పోటీ లేకపోవడంతో అక్షయ్ కుమార్ మూవీకి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. 9వ రోజు రాత్రి 8 గంటల వరకు ఇండియాలో 8122 షోలు ప్రదర్శితమై.. 19 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీతో ఇప్పటి వరకు 8.52 కోట్ల రూపాయల నెట్ రాబట్టింది. 9వ రోజు భూత్ బంగ్లా ఇండియాలో 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 12 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

అక్షయ్ కుమార్ సరికొత్త చరిత్ర
కాగా.. భూత్ బంగ్లా సినిమాతో అక్షయ్ కుమార్ చరిత్ర సృష్టించారు. బాలీవుడ్ హీరోలలో అత్యధికంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన హీరోగా నిలిచారు. అక్షయ్ కుమార్ 20 సార్లు ఈ ఘనత సాధించగా.. ఇంతకు ముందు సల్మాన్ ఖాన్ (18) పేరిట ఈ రికార్డ్ ఉండేది. ఆ తర్వాత అజయ్ దేవగణ్ (16), షారుఖ్ ఖాన్ (10), రణ్‌వీర్ సింగ్ (9) సార్లు 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X