Bhoothaddam Bhaskar Narayana Collections భూతద్ధం భాస్కర్ నారాయణ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరో శివ కందుకూరి, రాశీ సింగ్ హీరో, హీరోయిన్లుగా క్రైమ్, థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ. స్నేహాల్, శశిధర్, కార్తీక్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. విజయ సారాగ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా మార్చి 1వ తేదీన రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో మూవీ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఏపీ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో 18 ఏళ్లలో 17 హత్యలు జరిగిన నేపథ్యంగా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది. ఈ సినిమా ప్రమోషన్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి.ఈ సినిమాను క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా నటీనటులను, సాంకేతిక నిపుణులతో రూపొందించడంతో బడ్జెట్ భారీగానే అయింది. ఈ సినిమాను సుమారుగా 6 కోట్ల రూపాయలతో బడ్జెట్‌తో రూపొందించారు.

భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రానికి రిలీజ్‌కు ముందే మంచి రెస్సాన్ రావడంతో గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 500 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 100 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. శివ కందుకూరి కెరీర్‌లో అత్యధిక స్క్రీన్లలో రిలీజైన ఒక చిత్రం కావడం విశేషంగా మారింది.
భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాకు రిలీజ్ తర్వాత మిశ్రమ స్పందన లభించింది. దాంతో ఈ మూవీకి స్లోగా ఆక్యుపెన్సీ పెరగడం కనిపించింది. మార్నింగ్ షో, మ్యాట్నీకి 35 శాతం ఆక్యుపెన్సీ కనిపించగా, ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఆక్యుపెన్సీ విషయంలో పెరుగుదల కనిపించింది. దాంతో మంచి కలెక్షన్లు నమోదు కావడానికి ఆస్కారం లభించింది.

ఇక భూతద్దం భాస్కర్ నారాయణ నారాయణ సినిమా శివ కందుకూరి కెరీర్‌లో మంచి చిత్రమనే టాక్ వచ్చింది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 50 లక్షల రూపాయల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. శనివారం, ఆదివారాల్లో కలెక్షన్లు పెరిగితే 2 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











