Bichagadu 2 Day 1 Collections.. బిచ్చగాడు 2 మూవీకి పాజిటివ్ టాక్.. తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

బిచ్చగాడు చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లతో షేక్ చేసింది. తమిళ హీరో విజయ్ ఆంటోనికి తెలుగులో సాలిడ్ మార్కెట్‌ను క్రియేట్ చేసింది. బిచ్చగాడు చిత్రం తెలుగు హక్కులను కొనుగోలు చేసిన నిర్మాత చదలవాడ శ్రీనివాస్‌కు భారీ లాభాలను అందించింది. బిచ్చగాడు సినిమాకు ఫ్రాంచైజీగా వచ్చిన బిచ్చగాడు 2 చిత్రం మే 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

బిచ్చగాడు 2 బడ్జెట్, స్క్రీన్ కౌంట్: బిచ్చగాడు 2 చిత్రాన్ని చాలా రిచ్‌గా, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మించారు. ఈ సినిమా 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. విజయ్ ఆంటోని ఇప్పటి వరకు నిర్మించిన సినిమాల్లో అత్యధిక బడ్జెట్ ఈ సినిమాదే అనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాకు క్రేజ్ ఉండటంతో మొత్తంగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

 Bichagadu 2

ఏపీ, తమిళనాడు ప్రీ రిలీజ్ బిజినెస్: బిచ్చగాడు 2 ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఉష శ్రీ పిక్చర్స్ తెలుగు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకొన్నది. తెలుగు రాష్ట్రాల్లోని నైజాం థియేట్రికల్ హక్కులు 2.2 కోట్ల మేర, సీడెడ్‌ హక్కులు 1 కోటి రూపాయలు, ఆంధ్రా హక్కులు 2.8 కోట్ల మేర వసూలు చేశాయి. దాంతో ఈ సినిమా హక్కులు తెలంగాణలో 6 కోట్లకు బిజినెస్ జరిగింది.తమిళ హక్కులు 10 కోట్లకు అమ్ముడుపోయాయి.

బిచ్చగాడు 2 తమిళ ఆక్యుపెన్సీ: తమిళంలో బిచ్చగాడు చిత్రం పిచైక్కరాన్ టైటిల్‌తో రిలీజైంది. ఈ సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మధ్యస్తంగా నమోదైంది. ఈ సినిమా మార్నింగ్ షో ఆక్యుపెన్సీ 16 శాతానికిపైగా, మధ్యాహ్నం 20 శాతానికి పైగా, ఫస్ట్ షో 20 శాతానికి పైగా వసూళ్లను సాధించింది. ఇక సెకండ్ షోకు కూడా 25 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదు అవుతుందని ట్రేడ్ అంచనా.

 Bichagadu 2

బిచ్చగాడు 2 తెలుగు ఆక్యుపెన్సీ: బిచ్చగాడు 2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ కనిపించింది. ఏపీ, ఆంధ్రాలో కలిపి మార్నింగ్ షోకు 32 శాతం, మ్యాట్నీకి 45 శాతం, ఫస్ట్ షోకు 45 శాతం, సెకండ్ షోకు 40 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ సినిమాకు మంచి వసూళ్లను ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తెలుగు, తమిళంలో కలెక్షన్లు: బిచ్చగాడు 2 సినిమా తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక తమిళం భాషల్లో పెద్దగా ఈ సినిమాకు స్పందన కనిపించడం లేదనే ఆక్యుపెన్సీతో స్పష్టమంది. తమిళనాడులో తొలి రోజు 2 కోట్ల మేర వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

 Bichagadu 2

బిచ్చగాడు 2 లాభాల్లోకి రావాలంటే?: బిచ్చగాడు 2 చిత్రం ఇండియాలో సుమారు 6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 17 కోట్ల షేర్, 32 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. ఈ చిత్రం రానున్న రోజుల్లో మౌత్ టాక్ పెరిగి వసూళ్లను భారీగా సాధించగలిగితే.. ఈ చిత్రం తొలివారంలో లాభాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X