»   » ఈ రోజే అసలు పరీక్ష: 'బాహుబలి' కలెక్షన్స్ బిగ్ డ్రాప్?

ఈ రోజే అసలు పరీక్ష: 'బాహుబలి' కలెక్షన్స్ బిగ్ డ్రాప్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'బాహుబలి' చిత్రం మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.250కోట్ల వ్యయంతో ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కలెక్షన్స్ అద్బుతంగా ఉన్నాయని మీడియాలో నిముషానికో వార్త అన్నట్లు ప్రచారం అవుతోంది. అయితే దీనికి భిన్నంగా ట్రేడ్ లో వినపడుతోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పబడుతున్న ట్రేడ్ టాక్ ని బట్టి...ఈ చిత్రం కలెక్షన్ షేర్ డ్రాప్ అయినట్లు సమాచారం.


తొలిరోజు తెలుగు రాష్ట్రాల ఆల్ టైం కలెక్షన్ రికార్డును దాదాపు బ్రద్దలు కొట్టిన బాహుబలి వసూళ్లు..రెండో రోజున బారీ లోటు కనిపించిందని తెలుస్తోంది. దాదాపు చాలా చోట్ల యాభై నుంచి ఎనభై శాతం తగ్గటం చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. మొదటి రోడు 21 కోట్లు 63 లక్షలు షేర్ కలెక్టు చేసిన బాహుబలి రెండో రోజు 9 కోట్ల 27 లక్షలు మాత్రమే వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఈ రోజు కలెక్షన్స్ ని బట్టి అసలు అంచనాకు రాగలం అని చెప్తున్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


 Big Drop in 'Bahubali' Shares - Statistics

కలెక్షన్ డ్రాప్ వివరాల్లోకి వెళితే... (గమనిక : ఈ లెక్కలు ట్రేడ్ లో చెప్పుకోబడుతున్నవి మాత్రమే...)ఏరియా షేర్ కోట్లలో (తొలి రోజు) షేర్ (2 వ రోజు) డ్రాప్ (అంచనా)


నైజాం 6.22 3.89                            50%


సీడెడ్ 4.82 1.70                            65%


నెల్లూరు 0.93 0.26                          70%


కృష్ణా 1.25 0.53                             57%


గుంటూరు 2.54 0.61                        75%


వైజాగ్ 1.75 0.79                            55%


ఈస్ట్ గోదావరి 1.97 0.72                     64%


వెస్ట్ గోదావరి 2.15 0.77                     80%మరో ప్రక్క


ఈ చిత్రం చూసిన చాలా మంది...ఎడిటింగ్ చాలా హడావిడిగా చూసినట్లు అనిపిస్తుంది. అంతేకాక...కొంత కన్ఫూజన్ కు గురి అయిన ఫీల్ వచ్చిందనే టాక్ వినిపించింది. ఈ నేపధ్యంలో ... ఓ పది నిముషాలు సీన్లు ఈ సినిమా కు కలిపి...కన్ఫూజన్ తగ్గించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. సెకండాఫ్ లో ...సుబ్బరాజు, నాసర్, అనుష్క, ప్రభాస్, రానా ల మధ్య వచ్చే సన్నివేశాలు కలుపుతారని వినికిడి.


ప్రస్తుతం ఈ చిత్రం గూగుల్‌, ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో మొదటిస్థానంలో నిలిచి సామాజిక అనుసంధాన వేదికల్లోనూ సత్తా చాటింది. మొత్తం 4వేల థియేటర్లలో ఈ చిత్రాన్ని ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రభాస్‌, రాణా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు ముఖ్యభూమికలు పోషించారు.


ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బాహుబలి' ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం దాదాపుగా రూ.68 కోట్ల షేర్‌ వసూలు చేసి ట్రేడ్‌ వర్గాల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది భారతీయ చిత్రపరిశ్రమ రికార్డుగా ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.


ఇది వరకు షారుఖ్‌ ఖాన్‌ నటించిన 'హ్యాపీ న్యూ ఇయర్‌' రూ.65 కోట్లు సాధించిందని సమాచారం. ఆ లెక్కన బాలీవుడ్‌ రికార్డులూ పటాపంచలైనట్టే. ఒక్క హిందీ అనువాదమే రూ.5 కోట్లు వసూలు చేసిందని లెక్కలు చెబుతున్నాయి. హిందీలో అనువాదమైన ఓ ప్రాంతీయ చిత్రానికి ఈ స్థాయిలో వసూళ్లు దక్కడం ఇదే ప్రథమం.విదేశాల్లో అయితే 'బాహుబలి' చెలరేగిపోతోంది. గురు, శుక్రవారాలు కలిపి ఒక్క అమెరికాలోనే 2.4 మిలియన్‌ డాలర్లు సంపాదించింది. మొత్తంగా ఓవర్సీస్‌ మార్కెట్‌లో రూ.16 కోట్లు కొల్లగొట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి రూ.36 కోట్ల రూపాయల షేర్‌ సాధించినట్టు తెలుస్తోంది.

English summary
Despite the mind shocking collections recorded all over world on day 1 and from premiere shows, ‘Bahubali’ isn’t continuing the same enthusiasm at Box Office from day 2.
Please Wait while comments are loading...