Unstoppable Collections వీజే సన్నీ, సప్తగిరి మూవీ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటీ? ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

బిగ్‌బాస్ తెలుగు విజేత వీజే సన్నీ, కమెడియన్ సప్తగిరి హీరోలుగా దర్శకుడు డైమండ్ రత్నబాబు రూపొందించిన చిత్రం అన్‌స్టాపబుల్. రంజిత్ రావు నిర్మించిన ఈ చిత్రంలో నక్షత్ర, అక్సా ఖాన్, బిత్తిరి సత్తి, పృథ్వీ, పోసాని కృష్ణ మురళీ, రాజా రవీంద్ర, రఘుబాబు, ఆనంద చక్రపాణి, మురళీ గౌడ్, రూపాలక్ష్మీ, షకలక శంకర్, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. జూన్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి టాక్‌ను అందుకొన్నది. తొలి రోజు ఏ మేరకు కలెక్షన్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..

అన్‌స్టాపబుల్ సినిమా విషయానికి వస్తే.. చిన్ననాటి స్నేహితులైన వీజే సన్నీ, సప్తగిరి ఇద్దరు యూట్యూబ్‌లో సినిమా రివ్యూలు చెప్పుకొంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. క్రికెట్ బెట్టింగ్‌లో 10 లక్షల రూపాయలు పొగొట్టుకొని కష్టాల్లో పడుతారు. 10 లక్షల అప్పు తీర్చడానికి చేసే ప్రయత్నంలో వారు డ్రగ్స్, అమ్మాయిల అక్రమ రవాణా గ్యాంగ్‌ బారిన పడుతారు. ఆ తర్వాత ఏమైందనేది ఈ సినిమా కథ.

Bigg Boss Fame VJ Sunnys Unstoppable day 1 Collections worldwide

అన్‌స్టాపబుల్ చిత్రం రిలీజ్‌కు ముందు మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్నది. అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమా ప్రేక్షకులను, సినీ విమర్శకులను మెప్పించలేకపోయింది. మిక్స్‌డ్ రివ్యూలతో సినిమా థియేట్రికల్ రన్‌ను కొనసాగిస్తున్నది. అయితే ఆశించినంత మేరకు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోతున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అన్‌స్టాపబుల్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం నిర్మాత రంజిత్ రావు భారీగానే ఖర్చు పెట్టారు. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ కమెడియన్లందరిని ఈ సినిమాలో చూపించారు. ఫారిన్ లొకేషన్లలో షూట్ చేయడంతో బడ్జెట్ భారీగానే పెట్టారు. ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా సుమారుగా 8 కోట్లుగా అంచనా వేశారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 200 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు.

Bigg Boss Fame VJ Sunnys Unstoppable day 1 Collections worldwide

ఇక అన్‌స్టాపబుల్ సినిమా తొలి రోజు అంచనాలకు మించే కలెక్షన్లను రాబట్టింది. తొలి రోజు ఈ చిత్రం 91 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను, 45 లక్షల రూపాయల షేర్ సాధించింది అని ట్రేడ్ వర్గాలతోపాటు సినిమా యూనిట్ అధికారికంగా వెల్లడించాయి. ఇదే ఊపు రానున్న రోజుల్లో కొనసాగితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

అన్‌స్టాపబుల్ బ్రేక్ ఈవెన్ లక్ష్యం వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా థియేట్రికల్ వ్యాల్యూను 2.5 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. అంటే ఈ సినిమా కనీసం 2.5 కోట్ల షేర్ సాధిస్తే లాభాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ సినిమా రానున్న రోజుల్లో ఏ మేరకు లాభాలను సాధిస్తుందనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X