‘దేవదాస్’ 3 డేస్ కలెక్షన్ ఎంత? బిగ్‌బాస్ 2 గ్రాండ్ ఫినాలె ప్రభావంతో వసూల్లు మరింత డౌన్?

తెలుగులో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 రియాల్టీ షో నేడు గ్రాండ్ ఫినాలె దశకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు తెలుగు రాష్ట్రాల్లోని బిగ్ బాస్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోనునప్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఈవినింగ్ షోల విషయంలో నాని-నాగార్జున నటించిన 'దేవదాస్' సినిమా కలెక్షన్లపై ప్రభావం పడటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో భారీ సంఖ్యలో స్క్రీన్లలో విడుదలైంది. ఇద్దరు స్టార్స్ నటించిన సినిమా కావడంతో తొలి రోజు రెస్పాన్స్ బాగానే ఉంది. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12 కోట్ల గ్రాస్ రాబట్టింది.

ఆశించిన స్థాయిలో కలెక్షన్ లేదు

ఆశించిన స్థాయిలో కలెక్షన్ లేదు

అయితే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్మిన ధర రూ. 38 కోట్లతో పోల్చితే తొలి రోజు వసూళ్లు నిరాశ పరిచాయని చెప్పక తప్పదు. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం దాదాపు రూ. 7 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. కనీసం 30శాతం రికవరీ ఆశించినా... 18 శాతం కంటే ఎక్కువ రాలేదు.

Recommended Video

Nagarjuna Akkineni's Devadas Full Movie Now In Online !
ఆదివారం కలెక్షన్లపై బిగ్ బాస్ తెలుగు 2 ప్రభావం

ఆదివారం కలెక్షన్లపై బిగ్ బాస్ తెలుగు 2 ప్రభావం

గురువారం సినిమా విడుదల కాగా... బాక్సాఫీసు వద్ద శుక్ర, శనివారాల్లో కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. అయితే బిజినెస్ ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఏ సినిమాకు అయినా ఆదివారం అనేది చాలా కీలకం. ఈ రోజు సెలవు దినం కావడంతో ఎక్కువగా ఫ్యామిలీ ప్రేక్షకులు ఈవినింగ్ షోలకు వస్తారు. అయితే ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఉండటంతో ‘దేవదాస్' మూవీ కలెక్షన్లపై ప్రభావం పడబోతోంది.

ఏమీ చేయలేని పరిస్థితి

ఏమీ చేయలేని పరిస్థితి

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ‘దేవదాస్' మూవీ రైట్స్ రూ. 30.15 కోట్లకు అమ్ముడయ్యాయి. అయితే తొలి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన షేర్ రూ. 8.63 కోట్లు మాత్రమే అని అని తెలుస్తోంది. అసలే కలెక్షన్లు తక్కువగా ఉన్నాయంటే ఇపుడు ఆదివారం కలెక్షన్లపై బిగ్ బాస్ 2 గ్రాండ్ ఫినాలె దెబ్బ పడటం డిస్ట్రిబ్యూటర్లను మరింత దెబ్బతీసినట్లయింది.

 నాని షో వల్ల.. నాని సినిమాపై ప్రభావం

నాని షో వల్ల.. నాని సినిమాపై ప్రభావం

బిగ్ బాస్ తెలుగు 2కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాని.... తన షో వల్ల తన సినిమా నష్టపోయే పరిస్థితతి తొలిసారి ఎదుర్కొంటున్నారు. ఈ రోజు వసూళ్లపై బిగ్ బాస్ షో ఎంత ఎఫెక్ట్ పడింది అనేది సోమవారం విడుదలయ్యే లెక్కలతో తేలనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X