Lambasingi Collections దివి వద్యా మూవీ హిట్టా? ఫట్టా? లంబసింగి కలెక్షన్లు ఎంతంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో యువతార, బిగ్‌బాస్ ఫేమ్ దివి వద్యా నటించిన లంబసింగి చిత్రం మార్చి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవీన్ గాంధీ దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమాను యువ దర్శకుడు కల్యాణ్ కృష్ణ సమర్పించారు. కాన్సెప్ట్ ఫిలిం బ్యానర్‌పై ఈ సినిమాను ఆనంద్ తన్నీరు నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బిజినెస్, అలాగే కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
లంబసింగి చిత్రం నక్సల్స్, పోలీస్ బ్యాక్ డ్రాప్‌తో పక్కా రూరల్, నేటివిటి వాతావరణంతో రూపొందింది. పేద ప్రజల సంక్షేమం కోసం నక్సలైట్ దళంలో చేరిన యువతితో అప్పుడే పోలీస్ శాఖలో చేరి యువకుడు ప్రేమలో పడటం ట్విస్టుగా కనిపిస్తుంది. అయితే అదే అమ్మాయి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లడంతో కొత్తగా ఉద్యోగంలో చేరిన పోలీస్ సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత నక్సలైట్‌తో తన ప్రేమను గెలుచుకొన్నాడా? పోలీస్ మళ్లీ ఉద్యోగంలో చేరాడా? అనేది ఈ సినిమా కథ.

ఈ సినిమాను పూర్తిగా లంబసింగి ప్రాంతంలో అడవిలో చిత్రీకరించారు. కొత్తవారైనప్పటికీ.. ఎక్కువ మందితో ఈ సినిమాను షూట్ చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ఇతర ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా ఈ సినిమాను 2 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమాను సొంతంగా నిర్మాతలు రిలీజ్ చేశారు. ఈ సినిమాను తెలుగులో 150 నుంచి 200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. సుమారుగా 1 కోటి రూపాయలు థియేట్రికల్ వ్యాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 2 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సిన పరిస్థితి బాక్సాఫీస్ వద్ద కనిపించింది. అలా ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

అయితే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు నిదానంగా మొదలయ్యాయి. ఈ సినిమా తొలి రోజు ఈ మూవీ 30 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వారాంతంలో ఈ మూవీ వసూళ్లు పుంచుకొంటే.. బ్రేక్ ఈవెన్‌కు చేరవయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











