twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగిల్ 10 రోజుల కలెక్షన్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ.. 300 కోట్ల వైపు పరుగు

    |

    తమిళ దళపతి విజయ్ నటించిన బిగిల్ (విజిల్) చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం గత 10 రోజుల్లో సాధించిన వసూళ్ల ఊపును చూస్తే డిస్టిబ్యూటర్లను లాభాల బాట పట్టించే అవకాశం ఉందనే విషయం కనిపిస్తున్నది. ఫుట్‌బాల్ క్రీడా నేపథ్యంతో సామాజిక అంశాలను జోడించిన తెరకెక్కించిన ఈ చిత్రం తొలుత మిశ్రమ స్పందన నమోదు చేసింది. ఆ తర్వాత పబ్లిక్ టాక్ పెరగడంతో వసూళ్లు ఊపందుకొన్నది. వివరాల్లోకి వెళితే..

    10వ రోజు కలెక్షన్లు

    10వ రోజు కలెక్షన్లు

    విజిల్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తున్నది. నైజాంలో విజిల్ చిత్రం రూ.26 లక్షలు, సీడెడ్‌లో రూ.15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.6 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.3.8 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.2.3 లక్షలు, గుంటూరులో రూ.3.1 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.4 లక్షలు, నెల్లూరులో రూ.2 లక్షల రూపాయాలతో మొత్తంగా రూ.62 లక్షలు వసూలు చేసింది. 10వ రోజు కూడా డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ వసూళ్లకు పాల్పడటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

    మొత్తం 10 రోజుల కలెక్షన్లు

    మొత్తం 10 రోజుల కలెక్షన్లు

    ఇక విజిల్ చిత్రానికి వస్తే మొత్తం 10 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ.3.42 కోట్లు, సీడెడ్‌లో రూ.2.73 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.1.12 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.62 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.47 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ. 65 లక్షలు, నెల్లూరులో రూ.43 లక్షలు కలెక్ట్ చేసింది. దీంతో గత 10 రోజుల్లో 10.48 కోట్లు వసూలు చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచవ్యాప్తంగా బిగిల్ కలెక్షన్లు పరిశీలిస్తే.. ఇక తమిళనాడులో ఈ చిత్రం రూ.118 కోట్లు, ఏపీ, తెలంగాణలో రూ.17.30 కోట్లు, కర్ణాటకలో రూ.16.2 కోట్లు రాబట్టింది. మిగితా దేశాల్లో రూ.3.85 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం రూ.170.45 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.80 కోట్లు కలెక్ట్ చేసింది. గత 10 రోజుల్లో రూ.250.45 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. 129 కోట్ల షేర్‌ను సొంతం చేసుకొన్నది.

    లాభాల్లోకి రావాలంటే...

    లాభాల్లోకి రావాలంటే...

    ఇక బిగిల్ చిత్రం అన్ని భాషల్లో కలిపి రూ.134 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే దాదాపు రూ.135 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం డిస్టిబ్యూటర్లు తమ పెట్టుబడిని రాబట్టాలంటే ఇంకా రూ.5 కోట్ల రూపాయలను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయాల్సి ఉంది. ఇక తమిళనాడులో రూ.83.5 కోట్ల మేర బిజినెస్ చేయాల్సి ఉండగా, 10 రోజుల్ల రూ.65 కోట్ల మాత్రమే రాబట్టింది. ఇంకా పలు ప్రాంతాల్లో వసూళ్లను రాబట్టాల్సి ఉంది.

    English summary
    Bigil movie 10 days collections: East Cost Productions Mahesh Koneru got rights of Thalapathy Vijay movie Telugu rights. In this occassion, He tweeted that, Extremely proud to be associated with #Bigil Telugu version.. a prestigious project that will have a massive release simultaneously this Diwali along with the Tamil version. This movie collected Rs.250 crores gross and Rs.129 crores share world wide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X