twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న బిగిల్.. రికార్డు కలెక్షన్లతో దుమారం

    |

    తమిళ దళపతి, సూపర్‌స్టార్ విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేసన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగిల్ (విజిల్) చిత్రం బాక్సాఫీస్ వద్ద తడాఖా చూపిస్తున్నది. విజయ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పే దిశగా ప్రయాణం సాగిస్తున్నది. ఏఆర్ రెహ్మన్ సంగీతం, విజయ్ ఫెర్ఫార్మెన్స్, ఎమోషనల్ కంటెంట్ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల వద్దకు చేర్చాయి. దాంతో రికార్డు వసూళ్ల నమోదు సాధ్యమైందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వివరాల్లోకి వెళితే..

     చెన్నై బాక్సాఫీస్ వద్ద దూకుడు

    చెన్నై బాక్సాఫీస్ వద్ద దూకుడు

    బిగిల్ చిత్రం చెన్నై బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తున్నది. ఐదు రోజుల కలెక్షన్లు పరిశీలిస్తే.. శుక్రవారం రూ.1.79 కోట్లు, శనివారం రూ.1.73 కోట్లు, ఆదివారం రూ.1.74 కోట్లు, సోమవారం రూ.1.72 కోట్లు, మంగళవారం రూ.84 లక్షలు వసూలు చేసింది. గత ఐదు రోజుల్లో మొత్తంగా రూ.7.82 కోట్లు రాబట్టింది. వర్కింగ్ డే రోజున కూడా భారీ వసూల్లు సాధించడంతో బాక్సాఫీస్ వద్ద విజయ్ స్టామినా మరోసారి రుజువైంది.

    తమిళనాడులోనే రూ.100 కోట్లు

    తమిళనాడులోనే రూ.100 కోట్లు

    ఇక తమిళనాడు వ్యాప్తంగా బిగిల్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు ఈ చిత్రం తమిళంలోనే రూ.100 కోట్లకు చేరువైంది. ఘత ఐదు రోజుల్లో రూ.90 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకొన్నది. తొలివారం ముగిసే సమయానికి ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం లేకపోలేదనే మాటను ట్రేడ్ పండితులు వినిపిస్తున్నారు.

     ఓవర్సీస్‌లో ఒక మిలియన్

    ఓవర్సీస్‌లో ఒక మిలియన్

    ఇక ఓవర్సీస్‌లో కూడా అన్ని భాషలకు సంబంధించిన బిగిల్ ధమాకా చూపిస్తున్నది. ఈ చిత్రం ఉత్తర అమెరికాలో రూ.1 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. ఇప్పటి వరకు 14 సినిమాలు 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరితే అందులో ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్ అందించిన చిత్రాలు 9 ఉండటం విశేషంగా మారింది.

     తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రాల్లో

    ఇక తెలుగులో విజిల్ పేరుతో విడుదలైన ఈ చిత్రం రెండు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లు కలెక్ట్ చేస్తున్నది. నైజాంలో రూ.2.7 కోట్లకుపైగా, ఉత్తరాంధ్రలో 1 కోటి రూపాయలకుపైగా, సీడెడ్ రూ.2.5 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.60 లక్షలు, గుంటూరు జిల్లాలో రూ.90 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.55 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.40 లక్షలు, నెల్లూరులో రూ.28 లక్షలకుపైగా సాధించింది. మొత్తంగా చూస్తే ఈ చిత్రం సుమారు రూ.9 కోట్లకు చేరువైంది.

    200 కోట్ల జోష్‌తో

    200 కోట్ల జోష్‌తో

    రిలీజ్ రోజు నుంచి మిక్స్‌డ్ టాక్‌తో ముందుకెళ్లిన బిగిల్ చిత్రానికి ప్రేక్షకాదరణ తోడవ్వడంతో విజయ్ క్రేజ్‌కు ఎదురే లేకుండా పోయింది. ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే రూ.200 కోట్లు దాటడం ట్రేడ్ వర్గాల్లో జోష్ నింపింది. రానున్న రోజుల్లో భారీ సినిమాల రిలీజ్ లేనందున్న రికార్డు కలెక్షన్లు సాధిస్తుందనే ఆశాభావంతో డిస్టిబ్యూటర్లు ఉన్నారు.

    English summary
    Thalapathy Vijay's Bigil movie doing good at world box office. This movie collected Rs.200 crores world wide.this movie is directed by Atlee.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X