twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న బిగిల్.. విజయ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్.. లాభాల్లోకి రావాలంటే..

    |

    తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన బిగిల్ (తెలుగు విజిల్) చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను నమోదు చేస్తున్నది. మిక్స్‌డ్ టాక్‌ను ఎదురించి ఈ చిత్రం విజయ్ కేరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తున్నది. అక్టోబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం గత ఎనిమిది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఎంత వసూలు చేసిందంటే..

     ఏపీ, తెలంగాణలో

    ఏపీ, తెలంగాణలో

    ఏపీ, తెలంగాణలో బిగిల్ చిత్రం మంచి వసూళ్లను నమోదు చేసింది. ఏడో రోజు రెండు రాష్ట్రాల్లో రూ.50 లక్షలు రాబట్టడం విశేషం. ఏడో రోజు నైజాంలో రూ.15 లక్షలు, సీడెడ్‌లో రూ.9 లక్షలకుపైగా, ఉత్తరాంధ్రలో రూ.17 లక్షలు, తూగో జిల్లాలో రూ.2.4 లక్షలు, పగో జిల్లాలో రూ.1.5 లక్షలు, గుంటూరులో రూ.1.4 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.1.7 లక్షలు, నెల్లూరులో రూ.1.6 లక్షలకుపైగా వసూలు చేసింది. దాంతో ఏపీ, తెలంగాణలో కలిపి రూ.15.50 కోట్లకుపైగా వసూలు చేసింది.

    ఏడు రోజుల మొత్తం కలెక్షన్లు

    ఏడు రోజుల మొత్తం కలెక్షన్లు

    ఇక విజిల్ సినిమాకు యూత్ నుంచి మంచి ఆదరణ లభించడంతో గత ఏడు రోజుల్లో నైజాంలో రూ.2.95 కోట్లు, సీడెడ్‌లో రూ.2.42 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.1 కోటి, తూగో జిల్లాలో రూ.53 లక్షలు, పగో జిల్లాలో రూ.42 లక్షలు, గుంటూరులో రూ.98 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.57 లక్షలు, నెల్లూరులో రూ.39 లక్షలకుపైగా వసూలు చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.10.25 కోట్లుగా జరిగితే.. ఆ మొత్తం కంటే ఎక్కువగానే కలెక్షన్లను నమోదు చేసి లాభాల్లోకి ప్రవేశించింది.

    ఇతర రాష్ట్రాల్లో

    ఇతర రాష్ట్రాల్లో

    విజయ్ నటించిన సర్కార్ చిత్రం వసూళ్లు చేసిన కలెక్షన్లను బిగిల్ తిరుగ రాస్తున్నది. ఇక కర్ణాటకలో రూ.15 కోట్లకుపైగా, కేరళలో రూ.15 కోట్లకుపైగా, మిగితా రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.4 కోట్లకుపైగా రాబట్టింది. తాజా సమాచారం ప్రకారం.. గత ఎనిమిది రోజుల్లో ఈ చిత్రం తమిళనాడులో రూ.108 కోట్లు, ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మిగితా రాష్ట్రాల్లో ఏకంగా రూ.55 కోట్లు వసూలు చేసింది. తమిళంలో 2019 ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఓ రికార్డును నెలకొల్పింది.

    ఓవర్సీస్‌లో

    ఓవర్సీస్‌లో

    ఓవర్సీస్‌లో ఈ చిత్రం రూ.79 కోట్లు రాబట్టింది. దాంతో మొత్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.242 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక షేర్ విషయానికి వస్తే రూ.113 కోట్లు రాబట్టింది. ఈ సినిమా బిజినెస్ రూ.135 వద్ద ముగిసింది. దాంతో ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే సుమారు రూ.150 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఇంకా రూ.40 కోట్లు వస్తే డిస్టిబ్యూటర్లకు ఉపశమనం లభిస్తుంది.

    English summary
    East Cost Productions Mahesh Koneru got rights of Thalapathy Vijay movie Telugu rights. In this occassion, He tweeted that, Extremely proud to be associated with #Bigil Telugu version.. a prestigious project that will have a massive release simultaneously this Diwali along with the Tamil version. This movie collected above Rs.113 crores share and 235 crores gross.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X