బిగిల్ టెర్రిఫిక్ ఓపెనింగ్.. విజయ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్.. 100 కోట్లకు చేరువగా..
తమిళ సూపర్‌స్టార్ విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన బిగిల్ చిత్రం భారీ అంచనాలతోపాటు రికార్డు స్క్రీన్లలో రిలీజవ్వడం సంచలనంగా మారింది. రిలీజ్‌కు తగినట్టే తొలిరోజు వసూళ్లు రికార్డు స్థాయిలోనే ఉన్నట్టు సమాచారం. తాజాగా ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం విజయ్ కెరీర్‌లోనే అత్యధికంగా ఓపెనింగ్ సాధించిన చిత్రంగా బిగిల్ సొంతం చేసుకొన్నట్టు తెలుస్తున్నది. తొలిరోజు కలెక్షన్ల అంచనాలు ఎలా ఉన్నాయంటే...

బిగిల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా
బిగిల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా క్రేజీగా రిలీజైంది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా వరల్ వైడ్‌గా 3300కుపైగా స్క్రీన్లలో రిలీజైంది. బాలీవుడ్ హీరోకు ఏ మాత్రం తగ్గకుండా స్క్రీన్ల కౌంట్ ఉండటం.. అలాగే దక్షిణాదిలో భారీగా అడ్వాన్సు బుకింగులు కావడంతో ఓపెనింగ్ కలెక్షన్లు గ్రాండ్‌గా ఉంటాయని అంచనాకు వచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 45 శాతం
విజయ్ నటించిన బిగిల్ సినిమాకు వర్కింగ్ డే రోజున యావరేజ్‌గా ఆక్యుపెన్సీ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే ఇదే విజయ్ కెరీర్‌లో అత్యుత్తమ ఒపెనింగ్స్‌గా నమోదైనట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. అధికారికంగా ఎంత అనేది వెల్లడి కానున్నది.

రెండు రాష్ట్రాల్లో కలిపి 3 కోట్లు
ఏపీ, తెలంగాణలో తొలిరోజు కలెక్షన్లు విజయ్ కెరీర్‌లో బెస్ట్‌గా ఉంటాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి 3 కోట్లు షేర్ నమోదు అయ్యే అవకాశం ఉంది అని వెల్లడిస్తున్నారు. ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేకపోలేదనే మాట వినిపిస్తున్నది.

తొలి రోజు కలెక్షన్లు
ఇక ప్రపంచవ్యాప్తంగా బిగిల్ కలెక్షన్లు 65 కోట్ల మేరకు ఉండొచ్చనే మాట ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. అంతేకాకుండా సాయంత్రం టికెట్ల సేల్ పెరిగితే అది 70 కోట్ల గ్రాస్ కలెక్షన్ల వరకు వెళ్లే అవకాశం ఉంటుందనేది ట్రేడ్ రిపోర్టు. ఓవర్సీస్‌లో 110 లోకేషన్లలో 91770 డాలర్లు వసూలు చేసింది.

ప్రీ రిలీజ్ బిజినెస్
విజయ్ కెరీర్‌లోనే గతంలో ఎన్నడూ లేని విధంగా బిగిల్ భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందింది. ఈ చిత్రాన్ని రూ.180 వ్యయంతో తెరకెక్కించారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫుట్‌బాల్ క్రీడా నేపథ్యంగా సాగుతుంది. ఈ చిత్ర హక్కులు రూ.210 కోట్ల వద్ద క్లోజ్ అయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.


Click it and Unblock the Notifications











