బిగిల్ మూవీ 14 రోజుల కలెక్షన్లు: విజయ్ మ్యాజిక్.. ఊపిరి పీల్చుకొన్న బయ్యర్లు..
తమిళ సూపర్ స్టార్ విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన బిగిల్ (తెలుగులో విజిల్) చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. దక్షిణాదిలో తొలుత వసూళ్ల సునామీని సృష్టించిన ఈ చిత్రం ఆ తర్వాత కలెక్షన్లను రాబట్టడంలో నెమ్మదించింది. తొలివారంలో సాధించిన వసూళ్లను రెండో వారంలో నిలబెట్టుకోలేకపోయింది. గత 14 రోజుల్లో ఈ చిత్రం సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

14వ రోజున కలెక్షన్లు
తెలుగు రాష్ట్రాల్లో విజిల్ పేరుతో రిలీజైన విజయ్ చిత్రానికి రెండోవారంలో ఆదరణ కరువైంది. 14వ రోజున నైజాంలో ఈ చిత్రం సుమారు 2 లక్షలు, సీడెడ్ 1 లక్ష, ఉత్తరాంధ్రలో 80 వేలు, తూర్పు గోదావరిలో 70 వేలు, పశ్చిమ గోదావరిలో రూ.40 వేలు, గుంటూరులో రూ.60 వేలు, కృష్ణాలో 80 వేలు, నెల్లూరులో 20 వేలు సాధించింది. మొత్తంగా ఈ చిత్రం 6 లక్షలకుపైగానే సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

రెండు వారాల కలెక్షన్లు
తెలుగు రాష్ట్రాల్లో గత రెండు వారాల కలెక్షన్లు పరిశీలిస్తే.. నైజాంలో 3.6 కోట్లు, సీడెడ్‌లో రూ.2.85 కోట్లు, ఉత్తరాంధ్రలో 1 కోటికిపైగా, తూర్పు గోదావరి జిల్లాలో రూ.67 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.50 లక్షలు, గుంటూరులో రూ.1. 1 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.69 లక్షలు, నెల్లూరులో రూ.46 లక్షలు రాబట్టింది.

ఏపీ, తెలంగాణలో ఓవరాల్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విజిల్ చిత్రం రూ.10.25 కోట్ల మేర ప్రీ రిలీజ్ జరిగిందనేది ట్రేడ్ రిపోర్టు. అయితే గత 14 రోజుల్లో ఈ చిత్రం 11 కోట్లకుపైగానే వసూళ్లను రాబట్టింది. రెండు వారాల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడంతో డిస్టిబ్యూటర్లకు ఉపశమనం కలిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ప్రపంచవ్యాప్తంగా
ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఇలా ఉన్నాయి తమిళనాడులో అత్యధికంగా 125 కోట్లు, కర్ణాటకలో రూ.18 కోట్లకుపైగానే.. కేరళలో రూ.18 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.4 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా ఇండియాలో రూ.180 కోట్లకుపైగా, ఓవర్సీస్‌లో రూ.85 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.270 కోట్లు మేర గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. త్వరలోనే ఈ చిత్రం రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడానికి అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











