twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్‌పై బిగిల్ దాడి.. 200 కోట్లపై కన్నేసిన విజయ్

    |

    తమిళ సూపర్‌స్టార్ విజయ్, నయనతార జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ రూపొందించిన బిగిల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం తమిళనాడులోనే కాకుండా తమిళేతర రాష్ట్రాల్లో వసూళ్ల సత్తా చాటుతున్నది. గత నాలుగు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తూ ఏ మేరకు కలెక్షన్లు సాధించిందంటే..

    4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో

    4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో

    విజిల్ (బిగిల్) చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లతో దూసుకెళ్తున్నది. నాలుగవ రోజున నైజాంలో రూ.43.8 లక్షలు వసూలు చేయగా, సీడెడ్‌లో రూ.41 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.11.2 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.7 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణా 7 లక్షలు, నెల్లూరులో రూ.7 లక్షలు వసూలు చేశాయి. మొత్తంగా ఈ చిత్రం 4వ రోజున ఏపీ, తెలంగాణలో రూ.1.29 కోట్లు వసూలు చేసింది.

    గత నాలుగు రోజుల వసూళ్లు

    గత నాలుగు రోజుల వసూళ్లు

    గత నాలుగు రోజుల విజిల్ కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో పరిశీలిస్తే.. తొలి రోజున రూ.2.58 కోట్లు, రెండో రోజున రూ.1.78 కోట్లు, మూడో రోజున రూ.2.10 కోట్లు, నాలుగో రోజున రూ.1.29 కోట్లు వసూలు చేసింది. సినిమాకు పరీక్ష‌గా నిలిచే సోమవారం నాడు నిలకడగా విజయ్ సినిమా వసూళ్లు సాధించడం విశేషంగా మారింది. మొత్తంగా ఈ చిత్రం నాలుగు రోజుల్లో 12 కోట్లకుపైగా వసూలు చేసింది. తొలివారం ముగిసే సమయానికి సినిమా లాభాల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది.

    ప్రపంచవ్యాప్తంగా రోజువారీగా

    ప్రపంచవ్యాప్తంగా రోజువారీగా

    ఇక బిగిల్ (విజిల్) చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు చూసుకొంటే.. తమిళనాడులో రూ.63.50 కోట్లు, ఏపీ, తెలంగాణలో రూ.10.70 కోట్లు, కర్ణాటకలో రూ.10.33 కోట్లు, కేరళలో రూ.11 కోట్లు వసూలు చేసింది. మిగితా రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.2.15 కోట్లు రాబట్టింది. మొత్తంగా ఇండియాలో ఈ చిత్రం రూ.97.68 కోట్లు కలెక్ట్ చేసింది.

    ఓవర్సీస్‌లో ధమాకా

    ఓవర్సీస్‌లో ధమాకా

    ఇక ఓవర్సీస్‌లో కూడా బిగిల్ చిత్రం దూసుకెళ్తున్నది. యూఎస్, కెనడా, బ్రిటన్‌లతోపాటు పలు దేశాల్లో కలిపి రూ.38 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం రూ.150 కోట్లకు గ్రాస్‌కు, 80 కోట్ల షేర్‌కు చేరువైంది. ఫుట్‌బాల్ క్రీడా నేపథ్యంగా తెరకెక్కిన బిగిల్ చిత్రం సామాజిక అంశాలను టచ్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. తొలి వారం ముగిసే సమయానికి ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లను అధిగమించే అవకాశం ఉంది.

    English summary
    Thalapathy Vijay's Bigil movie doing good at world box office. This movie racing towards Rs.200 crores club which is directed by Atlee.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X