Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బాక్సాఫీస్‌పై బిగిల్ దాడి.. 200 కోట్లపై కన్నేసిన విజయ్
తమిళ సూపర్‌స్టార్ విజయ్, నయనతార జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ రూపొందించిన బిగిల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం తమిళనాడులోనే కాకుండా తమిళేతర రాష్ట్రాల్లో వసూళ్ల సత్తా చాటుతున్నది. గత నాలుగు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తూ ఏ మేరకు కలెక్షన్లు సాధించిందంటే..
4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో
విజిల్ (బిగిల్) చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లతో దూసుకెళ్తున్నది. నాలుగవ రోజున నైజాంలో రూ.43.8 లక్షలు వసూలు చేయగా, సీడెడ్‌లో రూ.41 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.11.2 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.7 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణా 7 లక్షలు, నెల్లూరులో రూ.7 లక్షలు వసూలు చేశాయి. మొత్తంగా ఈ చిత్రం 4వ రోజున ఏపీ, తెలంగాణలో రూ.1.29 కోట్లు వసూలు చేసింది.
గత నాలుగు రోజుల వసూళ్లు
గత నాలుగు రోజుల విజిల్ కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో పరిశీలిస్తే.. తొలి రోజున రూ.2.58 కోట్లు, రెండో రోజున రూ.1.78 కోట్లు, మూడో రోజున రూ.2.10 కోట్లు, నాలుగో రోజున రూ.1.29 కోట్లు వసూలు చేసింది. సినిమాకు పరీక్షగా నిలిచే సోమవారం నాడు నిలకడగా విజయ్ సినిమా వసూళ్లు సాధించడం విశేషంగా మారింది. మొత్తంగా ఈ చిత్రం నాలుగు రోజుల్లో 12 కోట్లకుపైగా వసూలు చేసింది. తొలివారం ముగిసే సమయానికి సినిమా లాభాల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా రోజువారీగా
ఇక బిగిల్ (విజిల్) చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు చూసుకొంటే.. తమిళనాడులో రూ.63.50 కోట్లు, ఏపీ, తెలంగాణలో రూ.10.70 కోట్లు, కర్ణాటకలో రూ.10.33 కోట్లు, కేరళలో రూ.11 కోట్లు వసూలు చేసింది. మిగితా రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.2.15 కోట్లు రాబట్టింది. మొత్తంగా ఇండియాలో ఈ చిత్రం రూ.97.68 కోట్లు కలెక్ట్ చేసింది.
ఓవర్సీస్లో ధమాకా
ఇక ఓవర్సీస్లో కూడా బిగిల్ చిత్రం దూసుకెళ్తున్నది. యూఎస్, కెనడా, బ్రిటన్‌లతోపాటు పలు దేశాల్లో కలిపి రూ.38 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం రూ.150 కోట్లకు గ్రాస్‌కు, 80 కోట్ల షేర్‌కు చేరువైంది. ఫుట్‌బాల్ క్రీడా నేపథ్యంగా తెరకెక్కిన బిగిల్ చిత్రం సామాజిక అంశాలను టచ్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. తొలి వారం ముగిసే సమయానికి ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లను అధిగమించే అవకాశం ఉంది.