Biker 3 Days Box Office: ఆ దెబ్బతో కోలుకోలేకపోతున్న బైకర్.. 3 రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే?

యువ హీరో శర్వానంద్, యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్, యువ హీరోయిన్ మాళవిక నాయర్ నటించిన తాజా చిత్రం బైకర్. బైక్ రేస్ నేపథ్యంగా యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు కోసం యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి రచన, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్ని పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డ, ఉప్పలపాటి ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సౌండ్ కోర్ ఎలిమెంట్‌గా సాగే ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ పసాల ఎడిటర్‌గా, ఏ పన్నీర్ సెల్వమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఏప్రిల్ 3వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Biker 3 Day Estimated Box Office Collections

బైక్ రేసింగ్ కాన్సెప్ట్‌తో 3డీ, 4డీఎక్స్, డాల్బీ విజన్, ఎపిక్, పీఎక్స్‌ఎల్ ఫార్మాట్‌లోకి రూపొందించిన ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 45 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ రైట్స్‌ను 23 కోట్ల రూపాయలు చెల్లించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేజిక్కించుకొన్నారు. ఓవర్సీస్, కర్నాటక, ఇతర ప్రాంతాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 30 కోట్ల రూపాయలకు పూర్తయింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వరల్డ్ వైడ్ 31 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది అని తెలిపారు.

Also Read
Dacoit First Review: డెకాయిట్ మూవీ ఫస్ట్ రివ్యూ
Dacoit First Review: డెకాయిట్ మూవీ ఫస్ట్ రివ్యూ

అయితే హైలీ టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు బజ్ క్రియేట్ చేయలేకపోయింది. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో సినిమా వస్తుందా? అనే అనుమానం ఆడియెన్స్‌లో క్రియేట్ అయింది. దాంతో క్లాస్ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా భారీగా ఓపెనింగ్స్ సాధించలేకపోయింది అనే అభిప్రాయాన్ని డిస్టిబ్యూటర్లు వ్యక్తం చేస్తున్నారు.

Recommended For You
ధురంధర్ 2 ప్రభంజనాన్ని అడ్డుకొన్న వజా 2.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ధురంధర్ 2 ప్రభంజనాన్ని అడ్డుకొన్న వజా 2.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని 250 కేంద్రాల్లో 500 స్క్రీన్లకుపైగా ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాకు తొలి రోజు 2.8 కోట్ల రూపాయలు, రెండో రోజు 2.33 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండు రోజుల్లో మొత్తంగా 4.13 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

You May Also Like
Leader Movie Review: లీడర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Leader Movie Review: లీడర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో తడబాబటుకు గురి అవుతున్నది. ఈ చిత్రం ఆడియెన్స్‌ను థియేటర్‌కు రప్పించలేకపోతున్నదనే విషయం తాజాగా వెల్లడైన కలెక్షన్లతో స్పష్టమైంది. వీకెండ్‌లో కొంత పాజిటివ్ కనిపించినా.. ఆ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండదనే విషయాన్ని ఎగ్జిబ్యూటర్లు, డిస్టిబ్యూటర్లు తెలిపారు. ఓవర్సీస్ మార్కెట్‌లో 150K డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 1.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Leader Movie Box Office: లెజెండ్ శరవణన్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. లీడర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Leader Movie Box Office: లెజెండ్ శరవణన్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. లీడర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఇక కీలకంగా మారిన మూడో రోజు అదివారం కూడా అంతంత మాత్రంగానే కలెక్షన్లు నమోదు అవుతున్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ సినిమా 3వ రోజు 2 నుంచి 2.5 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మూడు రోజుల్లో ఈ సినిమా 6 నుంచి 6.5 కోట్ల మేర వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకు ఓవర్సీస్‌లోను, తెలుగు, కర్ణాటక రాష్ట్రాల్లో ధురంధర్ 2 దెబ్బ పడిందని, ఆ సినిమా ప్రభంజనాన్ని తట్టుకొని కలెక్షన్లు సాధించడం కష్టమే అనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X