Biker 4 Days Box Office: బైకర్ బాక్సాఫీస్ రేసు స్పీడ్ ఎంత? ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి అంటే?
యువ హీరో శర్వానంద్, యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్, యువ హీరోయిన్ మాళవిక నాయర్ నటించిన తాజా చిత్రం బైకర్. బైక్ రేస్ నేపథ్యంగా యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు కోసం యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి రచన, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్ని పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డ, ఉప్పలపాటి ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సౌండ్ కోర్ ఎలిమెంట్‌గా సాగే ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ పసాల ఎడిటర్‌గా, ఏ పన్నీర్ సెల్వమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఏప్రిల్ 3వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

శర్వానంద్ కెరీర్‌లో భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా మారిన ఈ సినిమా విషయంలో ప్రమోషన్స్ సరిగా చేయలేకపోవడంతో పెద్దగా బజ్ క్రియేట్ కాలేకపోయింది. ఇదే సమయంలో రిలీజ్ అయిన రాకాస సినిమా యూనిట్ చేసిన ప్రమోషన్స్ మాదిరిగా శర్వానంద్, ఇతర టీమ్ విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే ఓపెనింగ్స్ భారిగా ఉండేవని ట్రేడ్ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి లోపాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం టెక్నికల్‌గా బాగుందనే టాక్ వచ్చింది. కానీ ఓవరాల్‌గా మిక్స్‌డ్ టాక్‌తో సరిపెట్టుకొన్నది.
ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 2.8 కోట్ల రూపాయలు, రెండో రోజు 2.4 కోట్ల రూపాయలు, మూడో రోజు 2.30 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిక్ ట్రెడ్ రిపోర్ట్ వెల్లడించింది. దాంతో ఈ సినిమా 7.5 కోట్ల రూపాయలు రాబట్టింది అని పేర్కొన్నారు. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 150K డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 1.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఓవరాల్‌గా 9 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.
అయితే ఈ చిత్రం కలెక్షన్ల గురించి యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటన చేసింది. మూడు రోజుల్లో ఈ చిత్రం 18 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని చిత్ర యూనిట్ ప్రకటించింది. అంటే ఈ సినిమా 9 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. తొలి సోమవారం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పరిస్థితి అంత ఆశాజనకంగా లేదనే విషయం డిస్ట్రిబ్యూటర్లు వెల్లడిస్తున్నారు. 4వ రోజు ఈ చిత్రం 1 కోటి నుంచి 1.5 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే భారీగా వసూలు చేయాల్సిన అవసరం ఉందనే అంటున్నారు.


Click it and Unblock the Notifications











