Biker 5 Days Box Office: బైకర్ 5వ రోజు కలెక్షన్లు.. శర్వానంద్ నష్టాల్లోంచి బయట పడాలంటే?
బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన స్పోర్డ్స్ డ్రామా చిత్రం బాక్సాఫీస్ వద్ద తడబాటుతో సాగుతున్నది. చార్మింగ్ స్టార్ శర్వానంద్, టాలెంటెడ్ యాక్టర్ మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. అయితే ఈ సినిమా టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిందనే ప్రశంసలు ఓ వర్గం నుంచి పొందింది. అయితే ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే థియేట్రికల్ వాల్యూకు భిన్నంగా ఈ సినిమా అంచనాలకు దిగువన కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ చిత్రం గత నాలుగు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంత? 5వ రోజు ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లను రాబడుతున్నది అనే వివరాల్లోకి వెళితే..
బైకర్ సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్ పేలవంగా ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్ కూడా నాసిరకంగా సాగింది. టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులంతా కట్టకట్టుకొని సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద పరుగులు పెట్టించేందుకు ప్రయత్నించినా బైకర్ వసూళ్ల రేసులో కింద మీద పడుతూ ముందుకు వెళ్తున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించే క్రమంలో తంటాలు పడుతున్నదని చెబుతున్నారు.

బైకర్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రోజున 2.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో రోజున 2.35 కోట్లు, మూడో రోజున 2.30 కోట్లు, 4వ రోజున 1.25 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 4 రోజుల్లో 8.65 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది. అయితే బ్రేక్ ఈవెన్ కావడానికి ఈ రేంజ్ కలెక్షన్లు సరిపోవనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
బైకర్ సినిమా ఓవర్సీస్‌లో ఆడియెన్స్‌ను ప్రభావితం చేయలేకపోతున్నదనే విషయం డిస్ట్రిబ్యూటర్లు, ట్రేడ్ అనలిస్టులు షేర్ చేసిన డేటాతో స్పష్టమైంది. నార్త్ అమెరికా అంటే అమెరికా, కెనడాలో ఈ సినిమా ఇంపాక్ట్ తక్కువగానే ఉందని చెబుతున్నారు. ఈ సినిమా గత నాలుగు రోజుల్లో 140K డాలర్లు వసూలు చేసింది. 4వ రోజు 31K డాలర్లు రాబట్టిందని ట్రేడ్ అనలిస్టులు తెలిపారు.
ఇది ఇలా ఉండగా, బైకర్ చిత్రం మూడు రోజుల్లో ఈ చిత్రం 18 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక నాలుగో రోజు ఈ చిత్రం 1 నుంచి 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 19 కోట్ల రూపాయల మేర వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 5వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. కష్టం మీద 1 కోటి రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. బైకర్ ఈ రేంజ్ స్పీడ్ సరిపోదు. ఇంకాస్త వేగాన్ని పెంచాలి. ఇంకా భారీ మొత్తాన్ని బాక్సాఫీస్ వద్ద నుంచి రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు.
యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు కోసం యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి రచన, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్ని పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డ, ఉప్పలపాటి ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సౌండ్ కోర్ ఎలిమెంట్‌గా సాగే ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ పసాల ఎడిటర్‌గా, ఏ పన్నీర్ సెల్వమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఏప్రిల్ 3వ తేదీన రిలీజైంది.


Click it and Unblock the Notifications











