Biker Box Office: పుంజుకోని బైకర్ కలెక్షన్లు.. బాక్సాఫీస్ కథ కంచికేనా?
తెలుగులో స్పోర్డ్స్ డ్రామా బాక్సర్ బాక్సాఫీస్ వద్ద తడబాటుతో సాగుతున్నది. చార్మింగ్ స్టార్ శర్వానంద్, టాలెంటెడ్ యాక్టర్ మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు కోసం యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి రచన, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్ని పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డ, ఉప్పలపాటి ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సౌండ్ కోర్ ఎలిమెంట్‌గా సాగే ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ పసాల ఎడిటర్‌గా, ఏ పన్నీర్ సెల్వమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఏప్రిల్ 3వ తేదీన రిలీజైంది. ఈ చిత్రం గత నాలుగు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంత? 7వ రోజు ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లను రాబడుతున్నది అనే వివరాల్లోకి వెళితే..

బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఈ సినిమా శర్వానంద్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా దాదాపు 45 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 22 కోట్ల మేర జరిగింది. ఏపీ, తెలంగాణ రైట్స్ 17 కోట్ల రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు బిజినెస్ 1.5 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 2.5 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 23 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్, 45 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల లక్ష్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.
ఇక ఈ సినిమా తెలుగు, ఇతర రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 2.8 కోట్ల రూపాయలు, రెండో రోజు 2.4 కోట్ల రూపాయలు, మూడో రోజు 2.30 కోట్ల రూపాయలు, నాల్గో రోజు 1.2 కోట్ల రూపాయలు, ఐదో రోజు 1 కోట్ల రూపాయలు, ఆరో రోజు 1 కోటి రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిక్ ట్రెడ్ రిపోర్ట్ వెల్లడించింది. దాంతో 7 రోజుల్లో 10 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది అని పేర్కొన్నారు.
బైకర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లోను, ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 3.7 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 3.95 కోట్ల రూపాయలు, మూడో రోజు 2.75 కోట్ల గ్రాస్, నాలుగో రోజు 1.7 కోట్ల గ్రాస్, 5వ రోజు 1.75 కోట్ల గ్రాస్, 6వ రోజు 1.75 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 15.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని పేర్కొన్నారు.
ఇక ఈ సినిమా 7వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. సుమారుగా 75 లక్షల నుంచి 1 కోటి రూపాయల మేర వసూళ్లను సాధించవచ్చు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దాంతో ఈ సినిమా 16 కోట్ల రూపాయల మేర వసూళ్లను టోటల్‌గా నమోదు చేసే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం ఈ చిత్రం ఇంకా 30 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు వసూళ్లను సాధిస్తుందా? ఇక చిత్రం వసూళ్ల కథ కంచికి చేరినట్టేనా? అనే అనుమానాలను ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











