Biker 9 days Box Office Report: బైకర్ 9 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్.. నష్టాల నుంచి బయటపడాలంటే?
చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన బైకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోతున్నది. ఆరంభంలో తొలి రెండు, మూడు రోజులు ఈ సినిమా గౌరవప్రదమైన వసూళ్లను సాధించినప్పటికీ.. ఆ తర్వాత అదే జోష్‌ను కొనసాగించలేకపోయిందనే విషయం ట్రేడ్ వర్గాల రిపోర్ట్‌తో స్పష్టమైంది. అంతేకాకుండా ఈ సినిమాకు కొత్తగా రిలీజైన సినిమాలు కూడా భారీ పోటీని ఇవ్వడంతో నిలకడగా కలెక్షన్లను నమోదు చేయలేకపోతున్నదని ట్రేడ్ పండితులు వెల్లడిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత వసూలు చేసింది? ఇంకా బ్రేక్ ఈవెన్ కావడానికి ఎంత కలెక్ట్ చేయాల్సి ఉంది అనే వివరాల్లోకి వెళితే..
బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఈ సినిమా శర్వానంద్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా దాదాపు 45 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 22 కోట్ల మేర జరిగింది. ఏపీ, తెలంగాణ రైట్స్ 17 కోట్ల రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు బిజినెస్ 1.5 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 2.5 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 23 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్, 45 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల లక్ష్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

సాక్ నిక్ రిపోర్ట్ ప్రకారం.. తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజు 2.75 కోట్ల రూపాయలు, రెండో రోజు 2.3 కోట్ల రూపాయలు, మూడో రోజు 2.25 కోట్ల రూపాయలతో 7.25 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. కానీ అదే జోష్‌ను కొనసాగించలేక.. సోమవారం నుంచి తడబాటుకు గురైంది. నాలుగో రోజు 1.10 కోట్ల రూపాయలు, ఐదో రోజు 1 కోటి రూపాయలు, 6వ రోజు 80 లక్షల రూపాయలు, ఏడో రోజు 60 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజు 35 లక్షల రూపాయలు వసూలు చ చేసింది. ఇక రెండో శనివారం ఈ సినిమా క్రితం రోజుల కంటే అధికంగా అంటే 50 లక్షల రూపాయలకుపైగా నెట్ కలెక్షన్లను వసూలు చేసింది అని డేటా వెల్లడించింది.
ఇక ఓవర్సీస్‌లో కూడా బైకర్ చిత్రం బాక్సాఫీస్ రేస్ అంతంత మాత్రంగానే ఉంది అని ట్రేడ్ అనలిస్ట్ వెంకీ బాక్సాఫీస్ వెల్లడించారు. ఈ సినిమా నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 185K నుంచి 200K డాలర్ల మేర వసూళ్లను రాబట్టింది అని వెల్లడించారు. అమెరికా, కెనడాలో ఈ సినిమాకు డెకాయిట్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, వజా 2 సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురు కావడంతో బాక్సాఫీస్ వద్ద తేలిపోయిందనే విషయం స్పష్టమైంది.
ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల రూపాయల నెట్, 17 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ఆంధ్రా, నైజాం, కర్ణాటక, తమిళనాడులో వసూలు చేసింది. ఇక ఈ సినిమా నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కలిపి సుమారుగా 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా భారీగానే వసూళ్లను రాబట్టాల్సిన టార్గెట్ ఈ చిత్రం ముందు ఉంది. రెండో వారంలో ఈ సినిమా భారీగా పుంజుకొంటే తప్పా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు కోసం యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి రచన, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్ని పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డ, ఉప్పలపాటి ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సౌండ్ కోర్ ఎలిమెంట్‌గా సాగే ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ పసాల ఎడిటర్‌గా, ఏ పన్నీర్ సెల్వమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఏప్రిల్ 3వ తేదీన రిలీజైన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











