Biker Movie Day 1 collections: బైకర్ మూవీ కలెక్షన్స్.. శర్వానంద్ మూవీకి తొలిరోజు ఎన్ని కోట్లంటే?

Biker Movie Day 1 collections: యువ హీరో శర్వానంద్, యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లెటెస్ట్ మూవీ 'బైకర్'(Biker). టాలీవుడ్‌లో డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామాగా విడుదలైంది. ఈ సినిమాకు కోసం యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి.. రచన,దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్ని పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డ, ఉప్పలపాటి ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే? అనే వివరాల్లోకి వెళితే..

యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ తెరకెక్కిన ఈ సినిమాపై ముందుగానే భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు మ్యూజిక్, సౌండ్ కోర్ ఎలిమెంట్‌గా సాగే ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ పసాల ఎడిటర్‌గా, ఏ పన్నీర్ సెల్వమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ముఖ్యంగా సౌండ్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ని మరింత ఎలివేట్ చేసేలా తీర్చిదిద్దారు. ఏప్రిల్ 3న విడుదలైంది.

Biker Day 1 Expected Box Office Collection Sharwanand Film Opening Worldwide Estimates

బైక్ రేసింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా కోసం టీమ్ అంతర్జాతీయ స్థాయిలో కృషి చేసింది. ఈ సినిమా కోసం దాదాపు రూ.45 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌కు పాజిటివ్ స్పందన రావడంతో 'బైకర్'పై ట్రేడ్ సర్కిల్స్‌లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో థియేట్రికల్ హక్కుల కోసం పోటీ నెలకొనగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యాన్సీ ధరకు ఈ హక్కులను దక్కించుకున్నారని సమాచారం. ఇది సినిమా మీద ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

బిజినెస్ పరంగా కూడా 'బైకర్' మంచి రేంజ్‌లోనే డీల్ అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో థియేట్రికల్ హక్కులు సుమారు రూ.23 కోట్లకు అమ్ముడవగా, ఓవర్సీస్, కర్ణాటక, ఇతర ప్రాంతాల కలిపి మొత్తం వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.30 కోట్ల వరకు చేరిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ హక్కులు కలిపి సినిమా మొత్తం బిజినెస్ విలువ దాదాపు రూ.70 కోట్లకు చేరుకుందని సమాచారం. ఈ లెక్కల ప్రకారం 'బైకర్' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు రూ.32 కోట్ల నెట్, అంటే దాదాపు రూ.60 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.

ఈ సినిమా విడుదలైన తొలిరోజు మిక్స్‌డ్ నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. రేసింగ్ సన్నివేశాలు, శర్వానంద్ పెర్ఫార్మెన్స్, టెక్నికల్ క్వాలిటీలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే కథ, స్క్రీన్‌ప్లేలో కొంత బలహీనత ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మూవీ తొలి రోజు రూ. 2 కోట్ల నుంచి 2.5 కోట్ల వరకు కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కడపటి వార్తలు అందేసరికి యూఎస్‌లో 50K డాలర్లు వసూలు చేసింది. గతంతో పోల్చితే ఈ సినిమా శర్వానంద్‌కు పేలవమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X