Biker Movie Day 2 collections: షాకింగ్ గా బైకర్ కలెక్షన్స్ ..శర్వా మూవీకి 2వ రోజు ఎన్ని కోట్లంటే?

Biker Movie collections: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బైకర్'. ఈ మూవీని డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామాగా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి తెరకెక్కించారు. ఈ మూవీలో డాక్టర్ రాజశేఖర్, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్ని పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డ, ఉప్పలపాటి ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి.

ముఖ్యంగా బైక్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన కథ కావడంతో యూత్ ఆడియన్స్‌లో మంచి క్యూరియాసిటీ ఏర్పడింది. ఇలా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 3న విడుదలైన బైకర్ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే? 2 వ రోజు ఎన్నికోట్లు కలెక్ట్ చేసిందనే వివరాల్లోకి వెళితే..

Biker Day 2 Expected Box Office Collection Sharwanand Film Big Jump Worldwide Estimates

'బైకర్' ఒక హై-క్వాలిటీ ప్రాజెక్ట్ అని చెప్పాలి. జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, జే యువరాజ్ సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన బలంగా మారాయి. ఇండోనేషియా వంటి అంతర్జాతీయ లొకేషన్స్‌లో షూట్ చేసిన రేసింగ్ ఎపిసోడ్స్ విజువల్‌గా ఆకట్టుకుంటున్నాయి. సౌండ్ డిజైన్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కలిసి సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేలా చేశాయి. ఈ అంశాల వల్లే విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి.

బిజినెస్ పరంగా కూడా 'బైకర్' మంచి రేంజ్‌లోనే డీల్ అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో థియేట్రికల్ హక్కులు సుమారు రూ.23 కోట్లకు అమ్ముడవగా, ఓవర్సీస్, ఇతర ప్రాంతాలు కలిపి మొత్తం థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.30 కోట్ల వరకు చేరింది. అదనంగా ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ హక్కులతో కలిపి మొత్తం బిజినెస్ విలువ సుమారు రూ.70 కోట్లకు చేరిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ.32 కోట్ల నెట్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.

ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే బైకర్ మూవీకి తొలి రోజు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు అందుకోలేకపోయింది. సాక్‌నిల్క్ ట్రాకింగ్ ప్రకారం, 'బైకర్' మొదటి రోజు రూ.2.10 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. గ్రాస్ పరంగా చూస్తే రూ.2.41 కోట్లకు చేరింది. మొత్తం ఆక్యుపెన్సీ సుమారు 22.5 శాతంగా నమోదైంది. ఇందులో తెలుగు వెర్షన్ ప్రధానంగా కలెక్షన్స్ అందించగా, తమిళ వెర్షన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా ఓపెనింగ్ అనుకున్న స్థాయిలో అందుకోలేదనే చెప్పాలి.

వీకెండ్ ఎఫెక్ట్ కారణంగా థియేటర్ ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉండటంతో డే 2లో రూ.2 నుంచి రూ.2.5 కోట్ల వరకు వసూళ్లు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే సినిమా ట్రెండ్ కాస్త మెరుగుపడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా శనివారం, ఆదివారం కలెక్షన్స్ పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాల అభిప్రాయం. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్దదిగా ఉండటంతో ప్రతి రోజు కలెక్షన్స్ స్థిరంగా పెరగాల్సిన అవసరం ఉంది. వీకెండ్‌లో మంచి జంప్ వస్తే సినిమా తిరిగి రేసులోకి వచ్చే అవకాశముంది. చూడాలి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X