Biker Closing Collections: బైకర్ మూవీ క్లోజింగ్ కలెక్షన్లు.. శర్వానంద్ మూవీకి లాభాలా? నష్టాలా?
యువ హీరో శర్వానంద్, యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్, యువ హీరోయిన్ మాళవిక నాయర్ నటించిన తాజా చిత్రం బైకర్. బైక్ రేస్ నేపథ్యంగా యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు కోసం యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి రచన, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్ని పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డ, ఉప్పలపాటి ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సౌండ్ కోర్ ఎలిమెంట్‌గా సాగే ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ పసాల ఎడిటర్‌గా, ఏ పన్నీర్ సెల్వమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఏప్రిల్ 3వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లను నమోదు చేసింది? ఈ చిత్రానికి లాభమా? నష్టమా? అనే వివరాల్లోకి వెళితే..

బైక్ రేసింగ్ కాన్సెప్ట్‌తో 3డీ, 4డీఎక్స్, డాల్బీ విజన్, ఎపిక్, పీఎక్స్‌ఎల్ ఫార్మాట్‌లోకి రూపొందించిన ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 45 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ రైట్స్‌ను 23 కోట్ల రూపాయలు చెల్లించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేజిక్కించుకొన్నారు. ఓవర్సీస్ రైట్స్ 2.5 కోట్లు, కర్నాటక, ఇతర ప్రాంతాలు హక్కులు 1.5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 27 కోట్ల రూపాయలకు పూర్తయింది. వరల్డ్ వైడ్ 28 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉండటంతో శర్వానంద్ కెరీర్‌లోనే అత్యధికంగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఏపీ, నైజాంలో కలిపి 750 స్క్రీన్లు, కర్నాటక, ఇతర రాష్ట్రాల్లో 100 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 3.7 కోట్ల రూపాయలు, రెండో రోజు 3.95 కోట్లు, మూడో రోజు 2.75 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 1.7 కోట్ల రూపాయలు, ఐదో రోజు 1.7 కోట్ల రూపాయలు, 6వ రోజు 1.3 కోట్ల రూపాయలు, ఏడో రోజు 1 కోటి రూపాయలు వసూలు చేసింది. తొలివారం 16.1 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
బైకర్ మూవీ రెండో వారంలో నిలకడగా వసూళ్లను సాధించినప్పటికీ.. బాక్సాఫీస్‌ను ప్రభావితం చేయలేకపోయింది. రెండో వారంలో సుమారుగా 6 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం రెండు వారాల్లో ఓవర్సీస్ కలెక్షన్లు (2.8 కోట్లతో) కలిపి మొత్తంగా 22.1 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 43 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అని యూవీ క్రియేషన్స్ వెల్లడించింది.
అయితే ఈ చిత్రం 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో జర్నీని ప్రారంభించింది. అయితే ఈ మూవీ సుమారుగా 15 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ల నమోదు చేసింది. థియేట్రికల్‌గా నష్టాలతోనే ముగిసింది. కానీ ఈ ప్రాజెక్ట్ లాభ నష్టాలను బేరీజు వేస్తే.. ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్‌కు వచ్చిన ఆదాయం కలిపి నిర్మాతలకు భారీ లాభాలను చేకూర్చింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications