Biker Worldwide Business: బైకర్ వరల్డ్ వైడ్ బిజినెస్.. శర్వానంద్ మూవీ లాభాల్లోకి రావాలంటే?
యువ హీరో శర్వానంద్, యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్, యువ హీరోయిన్ మాళవిక నాయర్ నటించిన తాజా చిత్రం బైకర్. బైక్ రేస్ నేపథ్యంగా యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు కోసం యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి రచన, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్ని పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డ, ఉప్పలపాటి ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సౌండ్ కోర్ ఎలిమెంట్‌గా సాగే ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ పసాల ఎడిటర్‌గా, ఏ పన్నీర్ సెల్వమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఏప్రిల్ 3వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

బైక్ రేసింగ్ కాన్సెప్ట్‌తో తెలుగులో డిఫరెంట్ అటెంప్ట్‌తో వస్తున్న ఈ మూవీని ఇండోనేషియాలో యాక్షన్, రేసింగ్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించారు. 3డీ, 4డీఎక్స్, డాల్బీ విజన్, ఎపిక్, పీఎక్స్‌ఎల్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు టెక్నికల్‌గా జాగ్రత్తలు తీసుకొన్నారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 45 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
బైకర్ సినిమా టీజర్, ప్రమోషనల్ కంటెంట్‌కు పాజిటివ్ టాక్ రావడంతో బిజినెస్ వర్గాల్లో క్యూరియాసిటీ ఏర్పడింది. దాంతో బిజినెస్ వర్గాలు థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. కానీ ఈ రేసులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు థియేట్రికల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకొన్నారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక బైకర్ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ రైట్స్‌ను 23 కోట్ల రూపాయలు చెల్లించి చేజిక్కించుకొన్నారు. ఓవర్సీస్, కర్నాటక, ఇతర ప్రాంతాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 30 కోట్ల రూపాయలకు పూర్తయింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఓటీటీ, మ్యూజిక్ రైట్స్, ఇతర రైట్స్ అన్నీ కలిపి ఈ సినిమా సుమారుగా 70 కోట్ల మేర బిజినెస్ చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సుమారుగా 32 కోట్ల రూపాయల నెట్, 60 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను ఈ సినిమా రాబడితే బ్రేక్ ఈవెన్ అవుతుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను పంచి పెట్టాలంటే ఓపెనింగ్స్ భారీ ఎత్తున రావాల్సి ఉంటుంది. అయితే శర్వానంద్ సినిమా ఏ రేంజ్‌లో ఓపెనింగ్స్ సాధిస్తుందనే విషయాన్ని వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











