Biker Pre release Business: బైకర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. శర్వానంద్ మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత నారీ నారీ నడుమ మురారితో విజయాన్ని అందుకున్నారు యంగ్ హీరో శర్వానంద్. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఆయనకు మరుపురాని విజయాన్ని అందించడంతో పాటు రేసులో నిలబడేలా చేసింది. దీంతో శర్వా వరుస ప్రాజెక్ట్స్‌తో మళ్లీ దూసుకెళ్తున్నారు. ఆయన తాజాగా నటిస్తోన్న చిత్రం బైకర్. యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ కీలకపాత్ర పోషిస్తూ ఉండటంతో పాటు ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌తో బైకర్ మూవీపై హైప్ నెలకొంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను క్లోజ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు పరిశీలిస్తే..
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వీ వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా ఈ బైకర్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అతుల్ కులకర్ణి, దయానంద్ రెడ్డి, బ్రహ్మాజీ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గిబ్రాన్ వైబోధ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ పలాస ఎడిటిర్‌గా వర్క్ చేస్తున్నారు. ఏప్రిల్ 3న వరల్డ్ వైడ్‌గా బైకర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న శర్వానంద్ కెరీర్‌లో ఎన్నడూ కనిపించని డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన శర్వానంద్ పోస్టర్స్, లుక్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా మారారు. మారుతున్న ట్రెండ్‌కు తగినట్లుగా పాత్ర బాగుంటే గెస్ట్ రోల్ పోషించడానికైనా తాను సిద్ధమని ఇప్పటికే రాజశేఖర్ హింట్ ఇచ్చారు. పలు సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్ని కూడా ఆయన పోషించారు. ఈ క్రమంలోనే బైకర్‌లో రాజశేఖర్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఇటీవల రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా బైకర్‌లో ఆయన పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇందులో రాజశేఖర్.. బుల్లెట్ సునీల్ అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. ఇండియన్ రేసర్లు లూజర్స్ అనే ఓపీనియన్ ఉంది... ఆ ఓపీనియన్ మారుద్దామని రాజశేఖర్ పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఈ గ్లింగ్స్ ఆకట్టుకుంది. దీనిని బట్టి చూస్తే.. హీరో రేసర్‌గా మారడంలో బుల్లెట్ సునీల్ అనే పాత్ర కీలకంగా ఉంటుందని.. హీరోకి గురువులా ఈ క్యారెక్టర్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బైకర్‌పై హైప్ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌కి గిరాకీ ఏర్పడింది. శర్వానంద్ మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు 35 కోట్ల రూపాయలు పలికినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వీటిలో ఒక్క బైకర్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్సే అక్షరాల 27 కోట్ల రూపాయలని టాక్. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ మేరకు .. డిజిటల్ రైట్స్ దక్కించుకుందట. ఆడియో, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ మరో 8 కోట్ల రూపాయలు పలికినట్లుగా తెలుస్తోంది. తద్వారా ఈ సినిమా అప్పుడే లాభాల్లోకి వెళ్లిపోయిందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక బైకర్ మూవీ ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్‌ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు 23 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా తమిళనాడు, కర్ణాటక, హిందీ, ఓవర్సీస్ ఏరియాల థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం బైకర్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 30 కోట్ల రూపాయలకు పైగా చేసే అవకాశం ఉందట. అదే జరిగితే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపి బైకర్ మూవీకి 70 కోట్ల రూపాయల డీల్ కానుంది. తద్వారా శర్వానంద్ మూవీలలో అత్యధిక బిజినెస్ జరిగిన చిత్రంగా బైకర్ నిలవనుంది.


Click it and Unblock the Notifications











