Bimbisara day 1 Collections బాక్సాఫీస్ వద్ద బింబిసార దూకుడు.. కల్యాణ్ రామ్ కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్!

ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించిన బింబిసార చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. సంయుక్త మీనన్, క్యాథరీన్ త్రెసా, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్స్ చేసిన బజ్‌కు తగినట్టుగానే కంటెంట్ పరంగా, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా రిచ్‌గా ఉండటంతో తొలి రోజు భారీ ఆక్యుపెన్సీ కనిపించింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే..

బింబిసార ప్రీ రిలీజ్ బిజినెస్

బింబిసార ప్రీ రిలీజ్ బిజినెస్

బింబిసార కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో రూ.5 కోట్లు, సీడెడ్‌లో 2 కోట్లు, ఆంధ్రా 6.5 కోట్లు బిజినెస్ చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తంగా ఈ సినిమా 13.50 కోట్ల బిజినెస్ నమోదు చేసింది. ఇక తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో మొత్తంగా 1.1 కోట్లు, ఓవర్సీస్‌లో 1 కోటితో మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 13.5 కోట్ల మేర బిజినెస్ చేసింది.

బింబిసారకు డీసెంట్ ఓపెనింగ్స్

బింబిసారకు డీసెంట్ ఓపెనింగ్స్

బింబిసార చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. గత రెండు నెలల్లో ఏ సినిమాకు కనిపించని స్పందన ఈ సినిమాకు లభించింది. హైదరాబాద్‌లోనే మొత్తం 359 షోలు ప్రదర్శించగా, 70 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్ 27 శాతం నమోదైంది. కరెంట్ బుకింగ్‌కు భారీ రెస్పాన్స్ కనిపించింది.

యూఎస్ ప్రీమియర్ల రూపంలో

యూఎస్ ప్రీమియర్ల రూపంలో

అమెరికాలో బింబిసార ప్రీమియర్లకు భారీగానే స్పందన కనిపించింది. కడపటి వార్తలు అందే సరికి యూఎస్‌లో 124 లొకేషన్లలో 62k డాలర్లు రాబట్టింది. తొలి రోజు ప్రీమియర్లతో కలిపి 100k డాలర్లను రాబట్టే అవకాశం ఉంది. ఒకవేళ 100K డాలర్లు వసూలు చేసినట్టయితే కల్యాణ్ రామ్ కెరీర్‌లో ది బెస్ట్ ఓపెనింగ్స్‌గా మారే అవకాశం ఉంది.

పాజిటివ్ టాక్‌‌తో ముందుకు

పాజిటివ్ టాక్‌‌తో ముందుకు

బింబిసార చిత్రానికి తొలి రోజు భారీగా రెస్సాన్స్‌తోపాటు పాజిటివ్ టాక్ హెవీగా క్రియేట్ అయింది. దాంతో రెండో రోజు కలెక్షన్లు పుంచుకొంటాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దాంతో ఈ సినిమా వారాంతంలో బ్రేక్ ఈవెన్‌కు చేరువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 తొలి రోజు కలెక్షన్ల అంచనా

తొలి రోజు కలెక్షన్ల అంచనా

కల్యాణ్ రామ్ ఫెర్ఫార్మెన్స్, కీరవాణి మ్యూజిక్ బింబిసార సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. దాంతో ఈ సినిమాకు తొలి రోజు 4 నుంచి 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెకండ్ షోలకు రెస్సాన్ బాగా ఉంటే.. 5 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది.

బింబిసార లాభాల్లోకి రావాలంటే

బింబిసార లాభాల్లోకి రావాలంటే

బింబిసార చిత్రం సుమారు 14.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. అయితే ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తే మూడు, నాలుగు రోజుల్లో లాభాల్లోకి వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. రానున్న రెండు రోజుల్లో ఈ చిత్రం ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X