Bimbisara day 1 Collections కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే ఊహించని విధంగా.. బింబిసార అఫీషియల్ బాక్సాఫీస్ రిపోర్ట్

నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోల్లో కల్యాణ్ రామ్ ఒకడు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాలను చేసిన అతడు.. విజయాలను మాత్రం చాలా తక్కువగానే అందుకున్నాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో సక్సెస్ లేక ఇబ్బందులు పడుతోన్న కల్యాణ్ రామ్ తాజాగా 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన దక్కింది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' మొదటి రోజు ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

బింబిసారగా మారిన కల్యాణ్ రామ్

బింబిసారగా మారిన కల్యాణ్ రామ్

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట రూపొందించిన సినిమానే 'బింబిసార'. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించాడు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు.

బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

నందమూరి కల్యాణ్ రామ్ మార్కెట్ తగ్గట్లుగానే 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 15.60 కోట్ల బిజినెస్ జరిగింది.

అలాంటి టాక్.. కలెక్షన్ల సునామీ

అలాంటి టాక్.. కలెక్షన్ల సునామీ

ఎన్నో అంచనాల నడుమ రూపొందిన టైమ్ ట్రావెల్ మూవీ 'బింబిసార' శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మంచి రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్ డేన అత్యధిక కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు వెల్లడించారు.

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'బింబిసార' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.29 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 90 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 43 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, గుంటూరులో రూ. 57 లక్షలు, కృష్ణాలో రూ. 34 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో కలిపి రూ. 6.30 కోట్లు షేర్, రూ. 9.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 6.30 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 32 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 65 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 7.27 కోట్లు షేర్‌తో పాటు రూ. 11.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 7.27 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 8.93 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

టాప్ 10లోకి చేరుకున్న బింబిసార

టాప్ 10లోకి చేరుకున్న బింబిసార

కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' మూవీ మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఊహించని రీతిలో రూ. 6.30 కోట్లు షేర్ రాబట్టింది. దీంతో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన టైర్ 2 హీరోల సినిమాల జాబితాలో ఇది 9వ స్థానానికి చేరుకుంది. ఇందులో 'ఇస్మార్ట్ శంకర్', 'అఖిల్', 'ఎమ్‌సీఏ', 'డియర్ కామ్రేడ్', 'లవ్ స్టోరి' చిత్రాలు టాప్ 5లో ఉన్నాయి.

 కల్యాణ్ రామ్ కెరీర్‌లో తొలి మూవీ

కల్యాణ్ రామ్ కెరీర్‌లో తొలి మూవీ

'బింబిసార' మూవీ మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 6.30 కోట్లు రాబట్టి కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే టాప్ ప్లేస్‌కు చేరుకుంది. గతంలో అతడు నటించిన 'ఇజం' రూ. 3.09 కోట్లు రాబట్టింది. దీన్ని ఇప్పుడు బింబిసార దాటేసి చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉండగా.. కల్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా రూ. 2.20 కోట్లు, 118 రూ. 1.60 కోట్లు మాత్రమే వసూలు చేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X