Bimbisara day 2 Collections బింబిసార మాస్ కుమ్ముడు.. లాభాలకు చేరువగా కల్యాణ్ రామ్ మూవీ
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన బింబిసార భారీ కలెక్షన్లను సాధిస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యుత్తమ వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచేందుకు రెడీ అవుతున్నది. ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇటీవల కాలంలో ఏ సినిమా సాధించిన కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఈ సినిమా రెండో రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే..

అమెరికాలో భారీగా
బింబిసార చిత్రానికి ఓవర్సీస్‌లో అంటే.. ముఖ్యంగా అమెరికాలో భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమాకు రెండో రోజున భారీగా కలెక్షన్ల గ్రాఫ్ పెరిగింది. మొదటి రోజు కంటే ఈ చిత్రం రెండో రోజున 50 శాతం వసూళ్లను పెంచుకొన్నది. కడపటి వార్తలు అందేసరికి ఈ చిత్రం అమెరికాలో 176 లొకేషన్లలో 402 షోల ద్వారా 34k డాలర్లను వసూలు చేసింది.

హైదరాబాద్‌లో స్ట్రాంగ్ బుకింగ్స్
బిండిసార చిత్రం రెండో రోజున హైదరాబాద్‌లో స్ట్రాంగ్‌గా వసూళ్లను రాబట్టింది. నగరంలో 356 షోలు ప్రదర్శించగా.. 26 శాతం ఆన్ లైన్ బుకింగ్‌తో 66 లక్షలు సాధించింది. కరెంట్ బుకింగ్‌తో కలిపి ఈ సినిమా కోటి రూపాయలకుపైగానే కలెక్షన్లను నమోదు చేసే అవకాశం ఉంది. RRR, కేజీఎఫ్2 సినిమా తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బింబిసార నిలిచింది.

బింబిసార రెండో రోజు ఆక్యుపెన్సీ
బింబిసార మూవీ రెండో రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. బెంగళూరులో 191 షోలు ప్రదర్శించగా 20 శాతానికిపైగా, చెన్నైలో 42 శాతానికిపైగా, విజయవాడలో 35 శాతం, గుంటూరులో 54 శాతం, వైజాగ్‌లో 50 శాతానికిపైగా అక్యుపెన్సీ నమోదైంది. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో 30 శాతానికిపైగా అక్యుపెన్సీ నమోదైంది.

తొలి రోజు రికార్డుల పర్వం
బింబిసార చిత్రం తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లను సాధించింది. గత రెండు నెలల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా కల్యాణ్ రామ్ కొత్త రికార్డును క్రియేట్ చేశారు. తొలి రోజున ఈ చిత్రం 8.9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాట్టింది. ఇక రెండో రోజున ఈ చిత్రం 6.5 కోట్ల వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం రెండు రోజుల్లో 15.5 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది.

బింబిసార వారాంతంలో బ్రేక్ ఈవెన్
బింబిసార ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 15.6 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఈ సినిమా 16.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. వారాంతంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











