Bimbisara day 4 Collections జయహో బింబిసార.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న కల్యాణ్ రామ్!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బింబిసార చిత్రం హల్‌చల్ చేస్తున్నది. ఓ మోస్తారు టాక్‌తో వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఇటీవల కాలంలో ఎవరూ ఊహించని కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో నమోదు చేస్తున్నది. గత మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం నాలుగో రోజు కూడా జోష్‌తో వసూళ్లను సాధించింది. నాలుగో రోజున బింబిసార సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఓవర్సీస్‌లో భారీ రెస్పాన్స్
ఓవర్సీస్‌లో కూడా బింబిసారకు ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. అమెరికాలో ఈ చిత్రం ఇప్పటికే 350k డాలర్లను వసూలు చేసింది. అమెరికాలో గత నాలుగు రోజుల్లో 1.12 కోట్ల షేర్, 2.8 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

ఆస్ట్రేలియాలో నాలుగు రోజుల్లో
ఆస్ట్రేలియాలో నాలుగో రోజున 31 లోకేషన్ల నుంచి 17297 ఆస్ట్రేలియన్ డాలర్లను రాబట్టింది. గత నాలుగురోజుల్లో ఈ చిత్రం 100k ఆస్ట్రేలియన్ డాలర్లను వసూలు చేసింది. ఓవర్సీస్‌లో మిగితా దేశాల్లో కూడా భారీగా వసూళ్లను నమోదు చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్‌లో మొత్తంగా 1.52 కోట్ల షేర్ సాధించింది.

4వ రోజున ఆంధ్రా, నైజాంలో
బింబిసార నాలుగో రోజున నైజాంలో 83 లక్షలు సాధించింది. ఇక ఆంధ్రా విషయానికి వస్తే.. సీడెడ్‌లో 56 లక్షలు, ఉత్తరాంధ్రలో 32 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 లక్షల షేర్ సాధించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 10 లక్షలు, గుంటూరులో 15 లక్షలు, కృష్ణా జిల్లాలో 12 లక్షలు, నెల్లూరులో 6 లక్షలు వసూలు చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజున 2.27 కోట్ల షేర్, 3.70 కోట్ల షేర్ రాబట్టింది.

బింబిసార తెలుగు రాష్ట్రాల్లో
బింబిసార నాలుగు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 6.47 కోట్ల షేర్, 11.0 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సీడెడ్‌లో 3.93 షేర్, 5.6 కోట్ల గ్రాస్ సాధించింది. వైజాగ్‌లో 2.58 కోట్ల షేర్, ఈస్ట్ గోదావరి జిల్లాలో 1.15 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 83 లక్షలు, కృష్ణా జిల్లాలో 99 లక్షలు, గుంటూరు జిల్లాలో 1.42 కోట్లు, నెల్లూరు జిల్లాలో 56 లక్షలు వసూలు చేసింది.

కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో
ఇక దేశవ్యాప్తంగా కూడా పలు ప్రధాన నగరాల్లో బింబిసారకు మంచి రెస్సాన్స్ లభిస్తున్నది. కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లో 1.52 కోట్ల షేర్, 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

4 కోట్లకుపైగా లాభంతో జోష్
ఇక ప్రపంచవ్యాప్తంగా బింబిసార సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం 20.57 కోట్ల షేర్, 34.2 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 15 కోట్లుగా నమోదవ్వడంతో 16 కోట్ల మేర బ్రేక్ ఈవెన్ సాధించాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం 4 కోట్లకుపైగా లాభంతో బింబిసార బాక్సాఫీస్ వద్ద హల్‌చల్ రేపుతున్నది.


Click it and Unblock the Notifications











