Bimbisara day 5 Collections 50 కోట్లపై కన్నేసిన బింబిసార.. కల్యాణ్ రామ్ కెరీర్‌లో హయ్యెస్ట్!
బింబిసార చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నది. హాలీడే, వర్కింగ్ డే అనే తేడా లేకుండా కలెక్షన్ల మోత మోగిస్తున్నది. కల్యాణ్ రామ్, సంయుక్త మీనన్, క్యాథరీన్ ట్రెసా నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఇప్పటికే 34 కోట్ల గ్రాస్, 21 కోట్ల షేర్ సాధించిన బింబిసార చిత్రం 5వ రోజున అదే జోష్‌ను కొనసాగించింది. 5వ రోజున ఈ చిత్రం ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందంటే..

నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా
బింబిసార చిత్రం గత నాలుగు రోజుల్లో భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఒకటో రోజున 11.5 కోట్ల గ్రాస్, 7 కోట్లకుపైగా షేర్, రెండో రోజు 8.5 కోట్ల గ్రాస్ 5.10 షేర్, మూడో రోజున 10 కోట్ల గ్రాస్, 5.92 కోట్ల షేర్, 4వ రోజన 4.30 కోట్ల గ్రాస్, 2.56 కోట్ల షేర్‌తో 34 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

తొలి వారం తర్వాత 50 కోట్ల క్లబ్‌లోకి
బింబిసార చిత్రం తొలి వారాంతం తర్వాత కూడా అదే జోష్ కనిపించింది. ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తున్నది. తొలివారం ముగిసే సమయానికి ఈ చిత్రం 50 కోట్ల మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. ఇదే జరిగితే కల్యాణ్ రామ్ కెరీర్‌లో రికార్డుగా మిగిలిపోయే అవకాశం ఉంది.

5వ రోజున అక్యుపెన్సీ సంతృప్తికరంగా
బింబిసార 5వ రోజు కలెక్షన్ల అంచనాకు వెళ్లితే.. తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ రెస్సాన్స్ కనిపించింది. ఆన్‌లైన్ బుకింగ్ కంటే.. కరెంట్ బుకింగ్‌కు ఎక్కువగా స్పందన ఉంది. ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజమాబాద్, గుంటూరు, విజయవాడ వైజాగ్‌లో భారీగా ఆక్యుపెన్సీ నమోదైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

500k క్లబ్‌లో బింబిసార
అమెరికాలో బింబిసార మూవీకి భారీగానే వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇతర దేశాల్లో కూడా మంచి స్పందన లభిస్తున్నది. యూఎస్‌లో ఈ చిత్రం 500K డాలర్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధమైంది.

5వ రోజు కలెక్షన్ల అంచనా..
ఇక తెలుగు రాష్ట్రాల్లో బింబిసారకు విశేషమైన స్పందన కనిపిస్తున్నది. కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. 5వ రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 2.3 కోట్ల షేర్ వసూలు చేయవచ్చని అంచనా వేశారు. ఇండియా వైడ్‌గా ఈ చిత్రం 3.3 కోట్లు రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 38 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











