Bimbisara day 6 Collections కొనసాగుతున్న బింబిసార కలెక్షన్ల జోరు.. 6 రోజు ఊహించని కలెక్షన్లు
బింబిసార చిత్ర వసూళ్ల ప్రవాహం బాక్సాఫీస్ వద్ద ఇంకా ధాటిగానే కొనసాగుతున్నది. కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేస్తున్నది. టైమ్ ట్రావెల్ కథతో తొలి సారి దర్శకత్వం వహించిన డైరెక్టర్ వశిష్ట తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నాడు. ఇప్పటికే లాభాల్లో కొనసాగుతున్న ఈ చిత్రం 6వ రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

అమెరికాలో తగ్గని బింబిసార
అమెరికాలో బింబిసార చిత్రం కమర్షియల్‌గా అద్భుతమైన విజయాన్ని అందుకొన్నది. 6వ రోజున ఈ చిత్రం 400K డాలర్లను నమోదు చేసింది. వర్కింగ్ డే రోజున కూడా సానుకూలంగా వసూళ్లను సాధించింది. ఈ వారాంతం లాంగ్ వీకెండ్ కావడంతో భారీ వసూళ్లను సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం 500K డాలర్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజున
బింబిసార చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గత 5 రోజుల్లో 20.6 కోట్ల షేర్, 32.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. 6వ రోజున కూడా భారీ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వైజాగ్ సిటీలో 5లక్షకుపైగా వసూళ్లను సాధించింది. నంద్యాలలో సుమారు 2 లక్షల గ్రాస్, ఏలూరు సిటీలో 1.5 లక్షలు, ఒంగోలులో 2 లక్షలు సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

నైజాం, ఆంధ్రాలో అక్యుపెన్సీ
తెలుగు స్టేట్స్‌లో బింబిసార చిత్రానికి మోస్తారు అక్యుపెన్సీ కనిపించింది. నైజాం, ఆంధ్రాలో సగటున 30 శాతం అక్యుపెన్సీ నమోదైంది. గుంటూరు, కాకినాడ, వైజాగ్, వరంగల్, విజయవాడ ప్రాంతాల్లో భారీగా అక్యుపెన్సీ నమోదు కాగా.. మిగితా ప్రధాన పట్టణాల్లో అంత స్పందన కనిపించలేదు.

6వ రోజు అంచనా ఎంతంటే?
ఇక దేశవ్యాప్తంగా బింబిసార చిత్రం సానుకూలమైన ఫలితాన్ని 6 రోజున సాధించింది. తాజా అంచనా ప్రకారం తెలుగుతోపాటు మిగితా రాష్ట్రాల్లో కలిపి 2.70 కోట్ల షేర్, 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఓవర్సీస్ కలెక్షన్లు అదనంగా మారుతాయి. ఒకవేళ ఈ రేంజ్ వసూళ్లను సాధిస్తే.. కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తుంది.

ఫుల్ రన్ టైమ్‌లో 15 కోట్ల షేర్
బింబిసార రెండో వారాంతం ముగిసే సమయానికి 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. గత 5 రోజుల్లో ఈ చిత్రం 39 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఐదు రోజుల్లోనే 7.42 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం ఫుల్ రన్ టైమ్‌లో 15 కోట్ల షేర్ సాధించే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











