Bimbisara డైరెక్టర్.. ఒకప్పుడు రిజెక్ట్ చేసిన వారి నుంచే ఆఫర్స్.. ఊహించని రెమ్యునరేషన్!
సినిమా పరిశ్రమలో ఎంతో కష్టపడితే గాని ఒక స్థాయికి వెళ్లలేరు. ఇక్కడ కష్టపడే గుణం ఎంత ఉన్నా కూడా అదృష్టం కూడా తోడవ్వాలి. బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన కూడా అందరూ సక్సెస్ కాలేరు. ఇక ఇటీవల దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకున్న వశిష్ట కూడా చాలా హార్డ్ వర్క్ చేసే ఇక్కడి వరకు వచ్చాడు. బింబిసార సినిమాతో అతని రేంజ్ ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒకప్పుడు రిజెక్ట్ చేసిన వారు ఇప్పుడు మళ్ళీ అతనితో సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం అతనికి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అనే వివరాల్లోకి వెళితే..

మొదట హీరోగా
డిస్ట్రిబ్యూటర్ గా మంచి గుర్తింపు అందుకున్న మల్లిడి సత్యనారాయణ రెడ్డి బన్నీ, ఢీ వంటి సినిమాలను కూడా నిర్మించారు. ఇక ఆయన కుమారుడు వేణు ఇప్పుడు వశిష్టగా ఇండస్ట్రీలోకి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. మొదట ఈ దర్శకుడు హీరోగా కూడా ప్రయత్నాలు చేశాడు. నటించిన మొదటి సినిమా అసలు ఏ మాత్రం సక్సెస్ కాలేదు. దీంతో దర్శకుడిగా మారాలి అని చాలా ప్రయత్నాలు చేశాడు. అప్పట్లో అల్లు శిరీష్ తో కూడా ఒక ఒక సినిమాను మొదలు పెట్టాలని అనుకుని ఆ తర్వాత మళ్లీ వెనుకడుగు వేయాల్సి వచ్చింది.

బాంబిసార కథతో
బింబిసార సినిమా కథ రాసుకున్నప్పుడు ఈ దర్శకుడు కొంతమంది ప్రముఖ హీరోలకు చెప్పాడు. ముఖ్యంగా అందులో రవితేజ కూడా ఉన్నారు. అలాగే తనకు దగ్గర మిత్రులైన మరి కొంతమంది హీరోలకు కూడా వశిష్ఠ బింబిసార కథ గురించి తెలియజేశారు. కానీ కథ బాగున్నప్పటికీ కూడా ఎలాంటి అనుభవం లేని వశిష్ట ఎంతవరకు న్యాయం చేయగలడు అనే భయంతోనే ఆ హీరోలు చేయడానికి వెనుకడుగు వేసినట్లు టాక్ అయితే వచ్చింది.

డబుల్ ప్రాఫిట్స్
ఇక మొత్తానికి కళ్యాణ్ రామ్ ఐతే వశిష్ట చెప్పిన కథను చాలా బలంగా నమ్మాడు. అతను చెప్పిన పాయింట్ తో పాటు ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండడంతో సరైన టెక్నిషియన్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చి వశిష్టకు ఎంతో సపోర్ట్ చేశాడు. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు అతని రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ కూడా పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్ వచ్చింది.

జీతం తరహాలో రెమ్యునరేషన్
అయితే బింబిసార సినిమాకు దర్శకుడు వశిష్ట ఎంత పారితోషికం తీసుకున్నాడు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతొంది. ఇక అతనికి ఒక ఫిక్స్ అమౌంట్ అయితే ఏమీ ఇవ్వలేదట. షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు కూడా నెలకు 3 లక్షల నుంచి ఐదు లక్షల మధ్యలో జీతం మాదిరిగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి లాభాల్లో కొంత షేర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

తరువాత సినిమాకు ఎంత?
ఇక బింబిసార సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు అతను సెకండ్ పార్ట్ కోసం కూడా సిద్ధమవుతున్నాడు. అయితే ఈ క్రమంలో ముందే అడ్వాన్స్ ఇచ్చి కొంతమంది ప్రముఖ నిర్మాతలు కూడా వశిష్టతో సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఇక మొదట్లో ఇతని రిజెక్ట్ చేసిన హీరోలు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందిస్తున్నారట. అంతేకాకుండా సినిమా చేద్దామని కూడా ఆఫర్లు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఇండస్ట్రీలో డిమాండ్ ప్రకారం వశిష్ట నెక్స్ట్ సినిమాకు మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











