Bimbisara Movie 1st Week Collections: ఊహించని రేంజ్ లో పడిపోయిన కలెక్షన్స్.. తీవ్రమైన పోటీ?
కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుని అతని కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఈ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని ఎవరు ఊహించలేకపోయారు. ఇక మొత్తానికి నిన్నటితో ఈ సినిమా ఏడు రోజులను పూర్తి చేసుకుంది. ఇక ఫస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. అలాగే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం వచ్చింది అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్
కల్యాణ్ రామ్ క్రియేట్ చేసిన హైప్ ద్వారా 'బింబిసార' మూవీకి మంచి బిజినెస్ జరిగింది. ఇక నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ చేసినట్లు సమాచారం.

7వ రోజు వచ్చిన కలెక్షన్స్
'బింబిసార' సినిమా 7వ రోజు ఆంధ్ర, తెలంగాణలో కలెక్షన్స్ చాలా వరకు తగ్గాయి. ఇక ఏరియాల వారిగా చూసుకుంటే నైజాంలో రూ. 21 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 0.63 కోట్లు షేర్, రూ. 1.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

మొదటి వారం టోటల్ కలెక్షన్స్
వారం రోజుల్లో కలిపి 'బింబిసార' మూవీ అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఏరియాల టోటల్ కలెక్షన్స్ చూసుకుంటే.. నైజాంలో రూ. 8.04 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.99 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.27 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.43 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.05 కోట్లు, గుంటూరులో రూ. 1.66 కోట్లు, కృష్ణాలో రూ. 1.20 కోట్లు, నెల్లూరులో రూ. 68 లక్షలతో కలిపి రూ. 22.32 కోట్లు షేర్, రూ. 35.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

వరల్డ్ వైడ్ 7 రోజుల కలెక్షన్స్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 7 రోజుల్లో రూ. 22.32 కోట్లు రాబట్టిన 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 25.57 కోట్లు షేర్‌తో పాటు రూ. 42.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రాఫిట్ ఎంతంటే?
ఫాంటసీ యాక్షన్ సినిమాగా రూపొందిన 'బింబిసార' మూవీ అంచనాలకు అనుగుణంగానే రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. దీంతో 7 రోజుల్లోనే బింబిసార రూ. 25.57 కోట్లు వచ్చాయి. అంటే ఈ లెక్కలో సినిమా 9.37 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా ముందుకు కొనసాగుతోంది.

కలెక్షన్స్ డౌన్.. తీవ్రమైన పోటీ?
'బింబిసార' మూవీకి 6వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.07 కోట్లు షేర్ వసూలు అయింది. కానీ, 7వ రోజు మాత్రం రూ. 63 లక్షలు మాత్రమే వచ్చాయి. అంటే సగం కంటే ఎక్కువగానే కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. ఇక శుక్రవారం రోజు నితిన్ మాచర్ల నియోజకవర్గం, శనివారం నిఖిల్ కార్తికేయ 2 సినిమాల సందడి ఉంటుంది కాబట్టి సినిమా కలెక్షన్స్ పై మరింత ప్రభావం చూపవచ్చు. మరి ఈ హాలిడేస్ వీకెండ్ ను సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











