Black Panther: 2 ఇండియాలో రికార్డు కలెక్షన్లు.. మూడో స్థానంలో హలీవుడ్ మూవీగా..
ప్రపంచ సినిమాలో ప్రేక్షకులను ఉర్రూతలూగించే మార్వెల్ మూవీ బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాడ్విక్ బోస్‌మెన్, తినోచ్ హ్యుయేర్టా, మైకెల్ జోర్డాన్, ఎంజెలా బాస్సెట్ లాంటి తారలు నటించిన ఈ చిత్రం నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా తొలి రోజు ఇండియాలో ఏ మేరకు వసూళ్లను సాధించిందంటే?

2018లో బ్లాక్ పాంథర్ రిలీజ్
బ్లాక్ పాంథర్ సినిమా తొలి భాగం 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాకు సీక్వెల్‌గా బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్ చిత్రం రిలీజైంది. బ్లాక్ పాంథర్ 1 మూవీ 2018లో తొలి రోజు 5.6 కోట్లు రాబట్టింది. అయితే తొలి పార్ట్ కంటే రెండో పార్ట్ భారీ వసూళ్లను రాబట్టింది.

2000 స్క్రీన్లలో బ్లాక్ పాంథర్ 2
బ్లాక్ పాంథర్ చిత్రం 2019 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇండియాలో ఈ చిత్రం దాదాపు 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తొలి రోజు భారీ ఆక్యుపెన్సీ కనిపించింది. అయితే వారాంతం వరకు ఈ సినిమా భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం తొలివారాంతంలో 50 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

మిక్స్‌డ్ టాక్‌తో కాస్త నిరాశగా
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ పాంథర్ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. సినీ విమర్శకులు, సగటు అభిమానులను పూర్తిస్తాయిలో మెప్పించలేకపోయింది. తొలి రోజు ఈ సినిమా 1 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.

2022లో మూడో స్థానంలో బ్లాక్ పాంథర్
ఇండియాలో రిలీజైన హాలీవుడ్ సినిమాల్లో బ్లాక్ పాంథర్ చిత్రం ఓ రికార్డును క్రియేట్ చేసింది. 2022లో డాక్టర్ స్ట్రేంజ్ తొలి రోజు 28.55 కోట్లు రాబట్టింది. థోర్ లవ్ అండ్ థండర్ 18.2 కోట్లు, బ్లాక్ పాంథర్ 14 కోట్లకుపైగా, జురాసిక్ పార్క్ వరల్డ్ 8 కోట్లు, బ్లాక్ ఆడమ్ 6.8 కోట్లు, ది బ్యాట్ మెన్ 6.66 కోట్లు వసూలు చేసింది.

ఇండియా వైడ్ తొలి రోజు కలెక్షన్లు ఇలా..
బ్లాక్ పాంథర్ మూవీ ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇంగ్లీష్ వెర్షన్ 8.2 కోట్లు, హిందీ వెర్షన్ 3.5 కోట్లు, తమిళంలో 30 లక్షలు, తెలుగులో 50 లక్షలు వసూలు చేసింది. ఈ చిత్రం భారతీయ భాషల్లో అన్ని కలెక్షన్లను కలుపుకొంటే.. 14 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications











